Australia to World Cup Final, Beat Pakistan by 5 Wickets: టీ20 వరల్డ్​కప్​లో​ ఆస్ట్రేలియా ఫైనల్స్​కు చేరింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్​లో పాకిస్థాన్​పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి ఫైనల్​ బరిలో​ నిలించింది కంగారుల జట్టు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్​ దశలో ఒక్క మ్యాచ్​ కూడా ఓడకుండా..దూకుడుగా ఆడిన పాకిస్థాన్​కు సెమీస్​లో మాత్రం ఓటమి తప్పలేదు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి.


పాకిస్థాన్​ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా ఒక ఓవర్​ మిగిలి ఉండగానే విజయం తన ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా టీమ్​.
ముందు రోజు ఇంగ్లాండ్​పై, న్యూజిలాండ్​ ఎలా అనూహ్య విజయం సాధించిందో.. అంతకన్నా ట్విస్ట్​లతో పాకిస్థాన్​పై ఆస్ట్రేలియా గెలిచింది.


Also read: ENG vs NZ T20: టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు న్యూజిలాండ్​


Also read: ICC T20I Rankings: ఐసిసి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన Virat Kohli, 5వ స్థానంలో KL Rahul


ఎవరెవరు ఎలా ఆడారంటే..


మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో ఆస్ట్రేలియా అటగాడు.. మార్కస్ స్టాయినిస్‌ పరుగులు చేసి 40 రాణించాడు. 17 బంతుల్లోనే 41 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు మాథ్యూ వేడ్​. 19వ ఓవర్​ చివరి మూడు బంతుల్లో వెంటవెంటనే మూడు సిక్సులు బాది ఆస్ట్రేలియాకు తిరుగులేని విజయాన్ని అందించాడు.


డేవిడ్ వార్నర్​ 49 పరుగులు చేసి.. ఔటయ్యాడు. అయితే నిజానికి అతని బ్యాట్​కు బంతి తగలలేదు. కీపర్ అప్పీల్ చేయడంతో అంపైర్​ ఔట్​గా ప్రకటించారు. రివ్యూ తీసుకుని ఉంటే.. వార్నర్​ ఇంకా కొద్ది సేపు ఆడేందుకు అవకాశం ఉండేది.


పాకిస్థాన్​ బౌలర్లలో  షాదాబ్‌ ఖాన్‌ ఒక్కడేకే 4 వికెట్లు పడటం విశేషం.


Also read: Australia: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ఫియాన్సీ రమన్‌ను చూశారా


పాకిస్థాన్ టీమ్ ఎలా ఆడిందంటే..


మొదట టాస్​ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీనితో ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ బ్యాటర్లు.. టోర్నీ మొత్తంలాగే దూకుడు ప్రదర్శించారు.
రిజ్వాన్​ 67 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టు కెప్టెన్​ బాబర్ అజామ్​ 39 పరుగులకు వెనుదిరిగాడు. ఫకార్​ జమాన్​ 55 పరుగులు చేసిన నౌటౌట్​గా నిలిచాడు. ఆసిఫ్​ అలా ఖాతా తెరవలేదు.


మొత్తం నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
స్టార్క్​ రెండు వికెట్లు, జంపా, కమిన్స్ చెరో వికేట్ తీశారు.


దుబాయ్​లో ఫైనల్స్​..


సెమీ ఫైనల్స్​లో విజయం సాధించిన న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా జట్లు ఈ నెల 14న దుబాయ్ వేదికగా ఫైనల్స్ ఆడనున్నాయి.


Also read: Rohit or Rahane: టీమ్​ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తు!


Also read: Rape Threat to Vamika: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook