Australia: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ఫియాన్సీ రమన్‌ను చూశారా

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలో ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ వివి రమన్‌ను పెళ్లిచేసుకోబోతున్నాడు. అందుకే  2022 మార్చ్ ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్ పర్యటనకు జట్టులో ఉండేది లేనిదీ కచ్చితంగా చెప్పలేనంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మెల్‌బోర్న్‌కు చెందిన భారతీయ సంతతి ఫార్మసిస్ట్ వివి రమన్‌తో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిశ్చితార్ధం 2020 లో జరిగింది. కోవిడ్ కారణంగా పెళ్లి చాలాసార్లు వాయిదా పడింది. 

Australia: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలో ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ వివి రమన్‌ను పెళ్లిచేసుకోబోతున్నాడు. అందుకే  2022 మార్చ్ ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్ పర్యటనకు జట్టులో ఉండేది లేనిదీ కచ్చితంగా చెప్పలేనంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మెల్‌బోర్న్‌కు చెందిన భారతీయ సంతతి ఫార్మసిస్ట్ వివి రమన్‌తో గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిశ్చితార్ధం 2020 లో జరిగింది. కోవిడ్ కారణంగా పెళ్లి చాలాసార్లు వాయిదా పడింది. 

1 /5

నిశ్చితార్ధ వేడుకలో రంగురంగుల భారతీయ దుస్తుల్లో తళుక్కుమన్పించారు. మ్యాక్స్‌వెల్..ఎమరాల్డ్ గ్రీన్ షేర్వానీ ధరించగా..అతడి ఫియాన్సీ వివి రమన్ డార్క్ గ్రీన్ కలర్ లెహంగా చున్నీలో మెరిసింది. 

2 /5

మ్యాక్స్‌వెల్, రమన్‌లు 2017 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 21న ఈ ఇద్దరి నిశ్చితార్ధం జరిగింది. 

3 /5

వివి రమన్‌తో వివాహమైతే భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రెండవ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఉంటాడు మ్యాక్స్‌వెల్. గతంలో షాన్ టెయిట్ ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 

4 /5

ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తుంటారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి పారిస్, లండన్, డబ్లిన్, న్యూజిలాండ్ దేశాల్ని సందర్శించారు. 

5 /5

ఆస్ట్రేలియాలో ఉంటున్న తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి వివి రమన్. విక్టోరియాలో ఉన్న మెంటోన్ గర్ల్స్ సెకండరీ కళాశాలలో వివి రమన్..వైద్య విద్య అభ్యసించింది.