ENG vs NZ T20: టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు న్యూజిలాండ్​

T20 WorldCup: టీ20 వరల్డ్​కప్​ సెమీస్​లో ఇంగ్లాండ్​పై ఘనవిజయ సాధించింది న్యూజిలాండ్​. దీనితో మొదటి సారి ఫైనల్స్​లో అడుగు పెట్టింది కవీస్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 06:46 AM IST
  • టీ20 వరల్డ్ కప్​లో ఇంగ్లాండ్​పై న్యూజిలాండ్ విజయం
  • తొలిసారి ఫైనల్​కు చేరిన కివీస్​ జట్టు
  • డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన
ENG vs NZ T20: టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు న్యూజిలాండ్​

New Zeland Enters In T20 World Cup for the First Time: టీ20 వరల్డ్​కప్​లో​ న్యూజిలాండ్ ఫైనల్స్​కు చేరింది. సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఆశ్చర్యకర రీతిలో ఇంగ్లాండ్​పై (Eng vs NZ) విజయం సాధించి.. తుది పోరుకు సిద్ధమైంది. 

మొదటి ఓవర్​లోనే.. గప్తిల్​ నాలుగు పరుగులకు ఔటవగా.. మూడో ఓవర్లో కెప్టెన్​ కేన్​ విలియమ్సన్ 5 పరుగులకే (Williamson)వెనుదిరిగాడు. దీనితో కివీస్ జట్టు విజయం అతి కష్టమని భావించినా.. ఇతర ఆటగాళ్లు అద్భుత విజయాన్ని అందించారు. దీనితో కివీస్ జట్టు తొలిసారి టీ20 వరల్డ్​కప్​లో (T20 worldcup Finals) ఫైనల్స్​కు చేరింది.

డారిల్ మిచెల్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి.. అదరగొట్టాడు. మరో బ్యాటర్​ డేవిన్​ కాన్వే 38 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు అడగా నిలచాడు. డారిల్​ మిచెల్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది అవార్డ్‌ (Daryl Mitchell Player of the Match) వచ్చింది.

Also read: ICC T20I Rankings: ఐసిసి ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి పడిపోయిన Virat Kohli, 5వ స్థానంలో KL Rahul

Also read: Virat Kohli: విరాట్‌ కోహ్లికి బెదిరింపుల విషయంలో హైదరాబాదీ అరెస్టు

మ్యాచ్​ సాగిందిలా..

టాస్​ ఓడి.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు బ్యాటర్లు కూడా ఆరంభంలో తడబడ్డారు. 

తొలి 5 ఓవర్లలో 37 పరుగులు చేయగా.. తరువాతి ఓవర్లో కీలక బ్యాటర్ బెయిర్​ స్టో (13 పరగులు) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా కొద్ది సేపు రాణించలేకపోయారు. దీనితో పదో ఓవర్​ ముగిసే సరికి ఇంగ్లాండ్​ స్కోరు 67గా ఉంది. అప్పటికే 2 వికెట్లు కోల్పోయింది.

కానీ ఆ తర్వాత.. మెయిన్​ అలీ, మలన్​ స్కోర్​ను ఉరకలు పెట్టించారు. దీనితో 15 ఓవర్లు ముగిసే సరికి 110 పరుగులు సాధించగలిగారు. ఇక ఆఖరి ఐదు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. 56 పరుగులు సాధించించారు. ఇంగ్లాడ్​ జట్టులో మెయిన్ అలీ అత్యధికంగా 51 పరుగులు  చేశాడు. 14 ఎక్స్​ట్రాలు లభించాయి. దీనితో కవీస్ జట్టు ముందు 167 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లీష్ టీమ్.

Also read: Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో.. నాలుగు మెయిడిన్లు చేసిన ఏకైక బౌలర్ గా 'అక్షయ్' ప్రపంచ రికార్డు!

Also read: Rohit Sharma as T20I Captain: టీమిండియా T20I కేప్టేన్‌గా రోహిత్ శర్మను నియమించిన BCCI

ఇంగ్లాండ్​పై కివీస్ రివేంజ్..

2019లో జరిగిన వన్డే వరల్డ్​కప్​లో ఓటమిని మిగిల్చిన ఇంగ్లాడ్​పై.. కవీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. దాదాపు మ్యాచ్ సగం పూర్తయ్యేటప్పటికి ఫైనల్​పై భారీ ఆశలు పెట్టుకున్న ఇంగ్లాడ్​ టీమ్​కు.. కివీస్ అనుకోని షాకిచ్చింది.

Also read: PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Also read: Ravishastri: టీమ్ ఇండియా కోచ్‌గా వైదొలగిన రవిశాస్త్రి, ఐసీసీపై ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News