IND vs AUS 1st Test Highlights : విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు సాధించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులు అయినట్లుగ కనిపిస్తోంది. భారత క్రికెట్ టెస్టు చరిత్రలో దారుణమైన స్కోరు నమోదు చేసింది. అది కూడా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోనే పడుతుంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్టులో భారత జట్టు ఓటమి కన్నా ఓడిపోయిన తీరే జట్టు ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్‌ను, భారత అభిమానులను బాధిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తొలి ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగుల ఆధిక్యం సాధించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) సేన రెండో ఇన్నింగ్స్‌లో ఎవరూ ఊహించని రీతిలో కేవలం 36 పరుగుల తేడాతో ఆలౌటైంది. అయితే మహ్మద్ షమీ గాయంతో రిటైర్డ్ హర్ట్ కావడంతో టెక్నికల్‌గా ఇది ఆలౌట్ కిందకి పరిగణనలోకి వస్తుంది. తద్వారా టెస్టు చరిత్రలో భారత క్రికెట్ జట్టు తమ అత్యల్ప ఇన్నింగ్స్ స్కోరును నమోదు చేసింది. టెస్టు క్రికెట్‌ ఓ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ (26 పరుగులు) తర్వాత ఇదే అత్యంత చెత్త స్కోరు కావడం గమనార్హం.


Also Read: Funny Memes On Prithvi Shaw: జూనియర్ సచిన్ పృథ్వీ షాపై పేలుతున్న జోక్స్



తద్వారా 46ఏళ్ల కిందట నమోదు చేసిన అత్యంత చెత్త రికార్డును భారత జట్టు బ్రేక్ చేసి అపప్రథను మూటకట్టుకుంది. 1974లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులోనూ భారత జట్టు కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. తాజాగా అంతకంటే చెత్త రికార్డును టీమిండియా  (India vs Australia) తమ ఖాతాలో వేసుకుంది. హనుమ విహారి చేసిన 8 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు కాగా, ముగ్గురు డకౌట్ అయ్యారు. ఉమేష్ యాదవ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


Also Read: Mohammad Amir: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్



భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కోహ్లీ 4 పరుగులకే పరిమితం కాగా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, అశ్విన్‌లు డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 5/8తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ 4/21 తన వంతు పాత్ర పోషించడంతో భారత్ 36 పరుగులకే చాపచుట్టేసింది. 


Also Read: Yuvraj Singh: టీ20 బరిలోకి దిగనున్న యువరాజ్ సింగ్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook