Yuvraj Singh: టీ20 బరిలోకి దిగనున్న యువరాజ్ సింగ్

Yuvraj Singh named for Syed Mushtaq Ali Trophy: అత్యుత్తమ భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడని చెప్పవచ్చు. అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్‌గా సైతం యువరాజ్ సింగ్ పేరుగాంచాడు. అయితే గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ మరోసారి మైదానంలో కాలుపెట్టనున్నాడు.

Last Updated : Dec 16, 2020, 11:59 AM IST
  • రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న యువీ
  • టీ20 టోర్నీ ఆడనున్న యువరాజ్
  • బీసీసీఐ అనుమతి కోసం వెయిటింగ్
Yuvraj Singh: టీ20 బరిలోకి దిగనున్న యువరాజ్ సింగ్

Yuvraj Singh named for Syed Mushtaq Ali Trophy: అత్యుత్తమ భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడని చెప్పవచ్చు. అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్‌గా సైతం యువరాజ్ సింగ్ పేరుగాంచాడు. అయితే గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ మరోసారి మైదానంలో కాలుపెట్టనున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు యువరాజ్ సింగ్. కానీ అభిమానులకు పూర్తిస్థాయి వినోదం మాత్రం అందదు. ఎందుకంటే కేవలం దేశవాలీ టోర్నీల్లో మాత్రమే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు యువీ.

Also Read: Mushfiqur Rahim vs Nasum Ahmed: ఫీల్డర్‌ని కొట్టబోయిన వికెట్ కీపర్.. వీడియో వైరల్

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఎంపికయ్యాడు. 30 మంది ఆటగాళ్ల ప్రాబబుల్స్ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ యువీ చోటు దక్కించుకున్నాడు. దాంతో యువరాజ్ మరోసారి మైదానంలో అడుగుపెట్టి సిక్సర్లతో మెరుపులు మెరిపించనున్నాడంటూ అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి యువీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పునీత్ బాలి వినతి మేరకు మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు యువీ. 

Also Read: Hardik Pandya son Agastya: హార్ధిక్ పాండ్యా తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా!

దేశవాలీలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బీసీసీఐకి లేఖ రాశాడు యువీ. భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ అనుమతి రాగానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తుది జట్టులో చోటు కన్ఫామ్ అవుతుంది. యువీ సిక్సర్ల కోసం భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు శ్రీశాంత్ సైతం మరోసారి బరిలోకి దిగనున్నాడు. నిషేధం గడువు ముగియడంతో శ్రీశాంత్ మ్యాచ్‌లు ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. 

Also Read: Worlds Shortest Woman Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు 

 

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News