Ind vs Aus 3rd T20I Highlights: మూడో టీ20లో పోరాడి ఓడిన కోహ్లీ సేన
India vs Australia 3rd T20I Highlights | భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్ ఇదివరకే భారత్ నెగ్గడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. టీమిండియా చివరివరకు పోరాడినా ప్రయోజనం దక్కలేదు. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడినా ఓటమి అంతరం తగ్గింది తప్ప లాభం లేకపోయింది.
India vs Australia 3rd T20I Highlights | భారత్‌తో జరిగిన నామమాత్రమైన మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఇదివరకే భారత్ నెగ్గడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. తొలుత టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 174 పరుగులకే పరిమితమైంది. దీంతో 12 పరుగులతో నామమాత్రమైన మూడో టీ20లో ఓటమిపాలైంది.
విరాట్ కోహ్లీ టాస్ నెగ్గి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూవెడ్ (80: 53 బంతుల్లో 7x4, 2x6), గ్లెన్ మాక్స్‌వెల్ (54: 36 బంతుల్లో 3x4, 3x6) హాఫ్ సెంచరీలు చేయడంతో ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. నటరాజన్ కాస్త మెరుగైన బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు.
Alo Read : Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు!
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (28: 21 బంతుల్లో 3x4) పరవాలేదనిపించాడు. శాంసన్ (10), అయ్యర్ డకౌట్ త్వరగా పెవిలియన్ బాట పట్టారు. విరాట్ కోహ్లీ (85: 61 బంతుల్లో 4x4, 3x6) భారీ హాఫ్ సెంచరీకి తోడు హార్దిక్ పాండ్యా (20: 13 బంతుల్లో 1x4, 2x6) రాణించే యత్నం చేసి ఔటయ్యాడు. చివర్లో కోహ్లీ ఔట్ కావడంతో భారత్ ఓటమి తప్పలేదు. అయితే శార్దూల్ ఠాకూర్ (17 నాటౌట్: 7 బంతుల్లో 2x6) రెండు సిక్సర్లు బాది ఓటమి అంతరాన్ని తగ్గించాడు.
Gallery: Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe