India vs England 1st Test Day 3 Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) కోసం రిజిస్టర్ చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా ఆశించిన స్థాయిలో రాణించాడు. గతానికి భిన్నంగా చెపాక్ మైదానంలో పరుగులు సాధించాడు. కానీ నాటకీయ పరిణామంతో కామెడీ తరహాలో పుజరా వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చెన్నై టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా(Team India) 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్(33 నాటౌట్; 68 బంతుల్లో 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్(8 నాటౌట్; 54 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్ 190.1 ఓవర్లలో 578 పరుగులకు ఆలౌటైంది.


Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain


 


జో రూట్(218) డబుల్ సెంచరీ, బెన్ స్టోక్స్(82; 118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఓలీ పోప్(34), జాస్ బట్లర్(30), డోమ్ బెస్(34) తమ వంతు పరుగు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు(England) భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ, నదీమ్ చెరో 2 వికెట్లు తీశారు.


Also Read: ICC World Test Championship Final: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి Team India అవకాశాలు ఇవే


 


ఓత్తిడికి గురవడంతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(6) త్వరగా వికెట్ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకున్నాడు. ఆపై టీమిండియాను ఇంగ్లాండ్ స్పినర్ డామ్ బెస్ ఇరుకున పెట్టాడు. బంతి పాతబడటంతో 4 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(11), అజింక్య రహానే(1) విఫలమయ్యారు. 


 



 



రిషబ్ పంత్(91; 88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు), పుజారా(73; 143 బంతుల్లో 11 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే 119 పరుగుల భాగస్వామ్యం తర్వాత నాటకీయంగా పుజారా(Cheteshwar Pujara) ఔటై, నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలుగా వచ్చిన బంతిని బలంగా షాట్ ఆడగా ఓ ఫీల్డర్‌కు తాకి మిడాన్ దిశగా దూసుకెళ్లి రోరీ బర్న్ చేతుల్లో పడింది. అక్కడ నుంచి మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. భారత్ పోరాటం కొనసాగుతోంది.


Also Read: Virat Kohli: కూతురి ఫొటో షేర్ చేసిన Anushka Sharma, పాప పేరేంటో తెలుసా


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook