IND vs ENG 1st Test Day 1: Joe Root 100వ టెస్టులో అజేయ శతకం, తొలిరోజు ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, టీమిండియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అంతకుముందు టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

1 /5

చెన్నైలో టీమిండియా(Team India)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (128; 197 బంతుల్లో 14x4, 1x6) తన వందో టెస్టులో అజేయ శతకం సాధించాడు. ఇది రూట్ కెరీర్‌లో 20వ టెస్టు సెంచరీ. ఈ ఏడాది రూట్ సాధించిన మూడో టెస్టు శతకం ఇది. (Source: Twitter) Also Read: Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

2 /5

ఇంగ్లాండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (87; 286 బంతుల్లో 12x4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన సిబ్లీ.. తొలిరోజు చివరి ఓవర్‌లో బుమ్రాకు చిక్కాడు. 2006 తర్వాత హషీం ఆమ్లా, జాకస్ కలిస్(Jacques Kallis) తర్వాత ఇన్ని బంతులు ఎదుర్కొన్న విదేశీ ఆటగాడు సిబ్లీనే కావడం గమనార్హం.  (Source: Twitter)

3 /5

టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు ఝార్ఖండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్. 2019 అక్టోబర్‌లో తొలి మ్యాచ్ ఆడాడు నదీమ్. తొలి టెస్టు తొలిరోజులో ఆటలో ఫీల్డింగ్ సందర్భంగా ఈ ఫీట్. (Photo: PTI) Also Read: Vijay Shankar Wedding Photos: పెళ్లిపీటలు ఎక్కిన Team India క్రికెటర్ విజయ్ శంకర్

4 /5

పర్యాటక జట్టు ఇంగ్లాండ్‌ను భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బతీశాడు. స్కోరు 63 వద్ద ఇంగ్లాండ్ 2 వికెట్లను కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డాన్ లారెన్స్(0)ను ఖాతా తెరవకముందే ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. డాన్ సిబ్లీ (87; 286 బంతుల్లో 12x4)ను తొలిరోజు ఆట చివరి ఓవర్లో బుమ్రాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. (Source: Twitter)

5 /5

తొలుత పేసర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వికెట్లు పడగొట్ట లేకపోయారు. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌ను పెవిలియన్ బాట పట్టించాడు అశ్విన్. (Photo: BCCI)