India vs England 4th Test: టీమిండియాకు కీలకంగా మారిన నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దూరం కానున్నాడు. ఇదివరకే ఇంగ్లాండ్‌తో జరగాల్సిన 5 టీ20ల సిరీస్‌కు ఇదివరకే బుమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తాజాగా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించినట్లు సమాచారం. మరోవైపు టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-1తో ఇంగ్లాండ్‌పై ఆధిక్యంలో కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం(మార్చి 4) నుంచి విరాట్ కోహ్లీ సేన అహ్మదాబాద్ వేదికగా చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే టెస్టు మ్యాచ్‌కు బుమ్రాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) విశ్రాంతి కల్పించింది. కానీ మార్చి 23 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నుంచి సైతం అనూహ్యంగా బుమ్రా దూరం కావాలని నిర్ణయించుకున్నాడని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది. పుణే వేదికగా బయో సెక్యూర్ వాతావరణంలో వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో వైట్ బాల్ సిరీస్‌లకు బుమ్రా టీమిండియా(Team India)కు దూరం కానున్నడని తెలుస్తోంది.


Also Read: Hardik Pandya: భార్య Natasa Stankovic‌తో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫొటోషూట్


ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి ఫెయిల్
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలం అయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. తాజా నిబంధనల ప్రకారం 8.5 నిమిషాలలో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి, లేక యోయో టెస్టులో 17.1 స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ తమిళనాడు స్పిన్నర్ ఇవి చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అతడితో పాటు ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికైన మరో ఆటగాడు సైతం ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడని తెలిపారు.


Also Read: Beautiful women cricketers: ప్రపంచంలో మోస్ట్ బ్యూటిఫుల్ మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా


టీ20 సిరీస్‌కు మరో 10 రోజులు ఉన్నందున ఈ గడువులోగా మరోసారి వరుణ్ చక్రవర్తితో పాటు ఆ ఆటగాడికి మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కాగా, గతంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేయగా, కుడి భుజం గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం యోయో, ఫిట్‌నెస్ టెస్టులు అతడికి పరీక్ష పెడుతున్నాయి.


Also Read: KTR: ఐపీఎల్ 2021 విషయంలో BCCIకి విజ్ఞప్తి చేసిన Telangana మంత్రి కేటీఆర్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook