ఐపిఎల్ 2020లో భాగంగా నేడు జరుగుతున్న 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్  ( Sunrisers Hyderabad ), కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెల్చుకున్న సన్‌రైజర్స్ జట్టు కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner ) తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఐపిఎల్ 2020లో ( IPL 2020 ) ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచుల్లో టాస్ గెలిచిన కెప్టేన్స్ మొదట ఫీల్డింగ్ చేయడానికే ఎంచుకోగా... డేవిడ్ వార్నర్ మాత్రమే మొదటిసారిగా బ్యాటింగ్ చేయడానికి ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ జట్టులో మిచెల్ మార్ష్ స్థానంలో మొహ్మద్ నబి, విజయ్ శంకర్ స్థానంలో సాహ వచ్చారు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సందీప్, నిఖిల్ స్థానాల్లో నాగర్‌కోటి, వరుణ్ జట్టులోకి వచ్చారు. Also read : SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ( SRH vs KKR in IPL ) ఒకరికొకరు తలపడిన చివరి ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్ 3 మ్యాచులతో పైచేయి సాధించగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆ తేడాను సవరించాలని కోల్‌కతా కెప్టేన్ దినేష్ కార్తిక్ భావిస్తున్నాడు.  


కోల్‌కతాపై ఆడిన చివరి రెండు మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ మొత్తం 152 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థ శతకాలు ఉన్నాయి. వార్నర్ స్ట్రైకింగ్ రేటు 167గా ఉంది. 


మరోవైపు ముంబై ఇండియన్స్‌తో ( Mumbai Indians ) బుధవారం జరిగిన 5వ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఓటమికి బ్యాటింగ్ ఆర్డర్ కారణమని.. అత్యధిక పరుగులు రాబట్టే ఆండ్రూ రస్సెల్ ( Andre Russell ) లాంటి ఆటగాడిని 6వ స్థానంలో బ్యాటింగ్‌కి పంపడం వల్లే జట్టు ఓటమిపాలైందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. Also read : MS Dhoni batting order: బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలకు ధోనీ రిప్లై


వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ ఇయాన్ మోర్గాన్ ( Eoin Morgan ) సైతం ఐదవ స్థానంలో రావడంతో అప్పటికే పరిస్థితులు చేయిదాటిపోయాయి. మరోవైపు అత్యధిక ధర వెచ్చించి సొంతం చేసుకున్న ప్యాట్ కమ్మిన్స్ ( Pat cummins ) సైతం గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెకల్లం లాంటి కోచ్ ఉన్న కోల్‌కతా జట్టు ప్రణాళిక లోపంతో బాధపడుతున్నట్టు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.


ఇక SunRisers Hyderabad విషయానికొస్తే.. ఈ సీజన్‌లో జరిగిన 3వ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడిన హైదరాబాద్.. 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. చివరి 5 ఓవర్లలో 43 పరుగులు అవసరం ఉందనగా.. సన్ రైజర్స్ జట్టులో 32 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి Royal challengers Bengaluru చేతిలో ఓటమిపాలైంది.


మరోవైపు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా మ్యాచ్ కి దూరమవడం కూడా ఆ జట్టుకు కొంత ప్రతికూల పరిణామంగా మారింది. సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ పరంగా పటిష్టంగానే ఉంది. ఈ మ్యాచులో రషీద్ ఖాన్ ( Rashid Khan ), భువనేశ్వర్ కుమార్ ( Bhuvaneshwar Kumar ) లాంటి బౌలర్లకు మొహ్మద్ నబి ( Mohammed Nabi ) తోడయ్యాడు. ఈ రెండు జట్ల బలాబలాలు ఇలా ఉంటే మ్యాచ్ ఫలితం ఎలా ఉండనుందో వేచిచూడాల్సిందే మరి. Also read : MS Dhoni, CSK vs DC match: చెన్నై బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కన్నెర్ర చేసిన ధోనీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe