IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టు (RR: Highest run chase in the IPL)గా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. 12 ఏళ్ల కిందటి తమ రికార్డును రాజస్థాన్ జట్టు తాజాగా సవరించడం గమనార్హం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఈ రికార్డు సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతం చేసింది. లీగ్‌లో భాగంగా జరిగిన 9వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) పై ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠపోరులో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది రాజస్థాన్. మరోవైపు తమ రికార్డునే 12 ఏళ్ల తర్వాత రాజస్థాన్ జట్టే సవరించడం గమనార్హం.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(106; 50 బంతుల్లో 10x4, 7x6), కెప్టెన్ కేఎల్ రాహుల్(69; 54 బంతుల్లో 7x4, 1x6) రాణించడంతో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్ తెవాతియా(53; 31 బంతుల్లో 7x6) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 226 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
కాగా, గతంలో ఈ రికార్డు రాజస్థాన్ పేరిట ఉండగా.. తమ రికార్డును తామే తిరగరాశారు. 2008లో (ఐపీఎల్ తొలి సీజన్‌లో) దక్కన్ చార్జర్స్ జట్టు 215 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌కు నిర్ధేశించింది. 7 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ 217 పరుగులు చేసి అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 12 ఏళ్ల తర్వాత, ఐపీఎల్ 2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తమ అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డును అధిగమించారు.
ఇవి కూడా చదవండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe