IPL 2020: పంజాబ్ టీమ్ కు చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో 9వ మ్యాచు రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. ఈ మ్యాచులో పంజాబ్ టీమ్ ( kings Eleven Punjab ) ను రాజస్థాన్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడించింది.

Last Updated : Sep 28, 2020, 12:50 AM IST
    • ఐపీఎల్ 2020 లో 9వ మ్యాచు..
    • పంజాబ్ టీమ్ ను రాజస్థాన్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL 2020: పంజాబ్ టీమ్ కు చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2020 ( IPL 2020 ) లో 9వ మ్యాచు రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. ఈ మ్యాచులో పంజాబ్ టీమ్ ( kings Eleven Punjab ) ను రాజస్థాన్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడించింది. రాజస్థాన్ కు ఈ విజయాన్ని సంజూ సాంసన్ ( 85 ), స్టీవ్ స్మిత్ ( 50 ) రాహుల్ తేవాటియా ( 50 ) బ్యాట్స్ మెన్ లు మంచి ఫెర్ఫార్మెన్స్ చూపించి అందించారు.

ALSO READ|  Dharani: దసరా రోజు ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

అంతకు ముందే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన మయాంక్ అగర్వాల్ 106 పరుగులతో పాటు, ఎల్ రాహుల్ 69 పరుగులు చేయడంతో రాజస్థాన్ టీమ్ కు 20 ఓవర్లలో 224 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించారు.

రాజస్థాన్ రికార్డు విజయం
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ధారించిన 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీమ్ 19.3 ఓవర్లలో 226 పరుగుల చేసింది. ఐపీఎల్ లో అద్భుతమైన ఛేజ్ గా మిగిలిపోయే గేమ్ గా దీన్ని మలిచారు రాజస్థాన్ ప్లేయర్స్

తేవ్ తియా సర్జికల్ స్ట్రైక్...
రాజాస్థాన్ రాయల్స్ లో చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తాడని పేరున్న రాహుల్ తేవాటియా ఈ మ్యాచులో అందరి అంచనాలను తలదన్నాడు. ఒకే ఓవర్ లో వరుసగా 5 సిక్సులు కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ALSO READ|  IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే

క్లైమాక్స్ లో సంజూ హీరోయిజం..
రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ సాంసన్ ఇన్నింగ్స్ లోని 16వ ఓవర్ లో 3 సిక్సులు బాది విజయానికి మార్గం సుగమం చేశాడు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News