టీమ్ ఇండియా హిట్ మ్యాన్ ( Hit Man ) రోహిత్ శర్మ ( Rohit Sharma Khel Ratna ) రాజీవ్ ఖేల్ రత్నకు నామినేట్ అయ్యారు. రోహిత్ శర్మతో పాటు మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. వీరిలో రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబులు టెన్నిస్ ప్లేయర్ మనికా బత్ర, పారా ఒలంపిక్ విభాగంలో ఎం తంగవేలు ఉన్నారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సిఫారసులు పంపింది. మంగళవారం సమావేశం నిర్వహించిన జాతీయ క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ సమీక్షనిర్వహించి నిర్ణయం తీసుకుంది. 



రోహిత్ శర్మకు ముందు పలువురు భారత క్రికెట్ ప్లేయర్స్ రాజీవ్ ఖేల్ రత్నే అవార్డుకు నామినేట్ అవడవంతో పాటు పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ( MS Dhoni ) , విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఉన్నారు. ఖేల్ రత్నేకు నామినేట్ అయిన నాలుగో క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ. అంతకు ముందు 1998లో సచిన్, 2007 ధోనీ, 2018లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు.