#Chiranjeevi152: మెగాస్టార్ 152వ చిత్రం ఫస్ట్ లుక్ తేదీ ప్రకటించిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి  అభిమానులకు గుడ్ న్యూస్.

Last Updated : Aug 18, 2020, 05:06 PM IST
    1. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.
    2. చిరంజీవి 152 చిత్రం ఫస్ట్ లుక్ విడుదల తేదీ తెలిసింది.
    3. మరిన్ని వివరాలు ఆగస్టు 22న అంటున్న రామ్ చరణ్
#Chiranjeevi152: మెగాస్టార్ 152వ చిత్రం ఫస్ట్ లుక్ తేదీ ప్రకటించిన రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి తాగాజా నటిస్తున్న సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి టైటిల్ ను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్టు ముందే చెప్పారు. తాజాగా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తేదీని ప్రకటించాడు రామ్ చరణ్ ( Ram Charan ). కొద్ది సేపటి క్రితమే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రామ్ చరణ్ మళ్లీ ఆగస్టు 22 కలుద్దాం అన్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్టు వార్త చక్కర్లుమ కొడుతోంది. కొరటాల శివ మార్క్ సామాజిక అంశంతో ఈ చిత్రం ఉండనున్నట్టు అభిమానులు అంచనా వేశారు. పైగా ఫస్టు లుక్ గురించి పెట్టిన పోస్టులో పిడికిలిలో ఉన్న ఎర్రబట్టను గమనిస్తే ఏదో రివల్యూషనరీ చిత్రం కాబోతుంది అనే సందేహం వ్యక్తం అవుతోంది. అయితే మరిన్ని వివరాల కోసం ఆగస్టు 22వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు

Trending News