Test captaincy toss-up between Rohit Sharma and Ajinkya Rahane: వరల్డ్​కప్​ 2021లో పేలవ ప్రదర్శన కారణంగా (T20 Worldcup 2021) గ్రూప్ దశలోనే టోర్నీని వీడిన టీమ్ ఇండియా.. త్వరలో న్యూజిలాండ్​తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్​లకు (India vs NZ) సిద్ధమవుతోంది. అయితే న్యూజిలాండ్​తో ఆడే జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తప్పుకున్నాడు. బీసీసీఐ ఆ  బాధ్యతలను రోహిత్ శర్మకు (T20 New Captain Rohith Sharma) అప్పగించింది. అజింక్యా రహానే వైస్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.


ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్​తో జరిగే.. టీ20 మ్యాచులకు కూడా విరాట్​ సహా కొంత మంది ప్లేయర్లు ఆడటం లేదు. బయోబబుల్​, ఐపీఎల్ సహా అంతకు ముందు వరుస మ్యాచ్​లు, పని ఒత్తిడి వంటి కారణాలతో ప్లెయర్లకు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది బీసీసీఐ.


Also read: Australia: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ఫియాన్సీ రమన్‌ను చూశారా


Also read: ENG vs NZ T20: టీ20 వరల్డ్​కప్​లో తొలిసారి ఫైనల్స్​కు న్యూజిలాండ్​


బీసీసీఐ అయోమయం..


టీ20 కెప్టెన్సీని వీడనా.. టెస్ట్, వన్డే​ కెప్టెన్​గా విరాట్​ కోహ్లీనే కొనసాగుతున్నారు. రెస్ట్​ కారణంగా.. ఈ నెల 25-29 మధ్య జరిగే తొలి టెస్ట్​కు కూడా విరాట్​ కోహ్లీ దూరంగా ఉండనున్నాడు. దీనితో ఇప్పటికే టీ20 కెప్టెన్సీని రోహిత్​కు అప్పగించిన బీసీసీఐ.. టెస్ట్ కెప్టెన్​ ఎవరనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది.


రోహిత్ శర్మకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలా? లేదా అజింక్యా రాహానేను టెస్టు జట్టుకు తాత్కాలిక సారథిగా నియమించాలా అనే విషయంపై తీవ్రంగా చర్చసాగుతోంది.


Also read: Shoaib Akhtar: ఆసీస్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు..అతడి కెప్టెన్సీ బాగాలేదు, షోయబ్ సంచలన వ్యాఖ్యలు


Also read: Australia vs Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచుకు ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లు మ్యాచుకు దూరం!


టీ20 టీమ్ రెడీ.. కానీ..


కెప్టెన్సీపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. టీ20 జట్టును ప్రకటించింది బీసీసీఐ. 16 మందితో కూడిన ఈ జట్టు నవంబర్​ 17న మొదటి టీ20 (జైపూర్​), నవంబర్ 19న రెండో టీ 20(రాంచి), నవంబర్ 21న మూడో టీ20 (కోల్​కతా) ఆడనుంది.


ఇంకా కెప్టెన్ ఎవరనై దానిపై స్పష్టత లేనందున.. న్యూజిలాండ్​తో తలపడే జట్టుపై తుది నిర్ణయం తీసుకోలేదు బీసీసీఐ.


ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా.. 25-29 మధ్య తొలి టెస్ట్​ జరగనుంది. రెండో టెస్ట్ మంబయిలో డిసెంబర్ 3-7 మధ్య జరగనుంది.


Also read: IPL Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఎక్కువ ధర పలికే క్రికెటర్లు వీరే


Also read: Rape Threat to Vamika: కోహ్లీ కూతురును రేప్ చేస్తానని బెదిరించిన తెలుగు యువకుడు అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook