IPL Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఎక్కువ ధర పలికే క్రికెటర్లు వీరే

ప్రపంచంలోనే అత్యధికంగా చూసేది ఐపీఎల్. దేశ విదేశాల్లోని క్రికెటర్లు తమ తమ ప్రతిభ చాటేందుకు అద్భుతమైన వేదిక ఇది. ఇప్పటికే ఐపీఎల్ 2021 ముగిసింది. ఎవరి సత్తా ఏంటనేది చూశాం. ఇక ఐపీఎల్ 2022 కోసం మెగా ఆక్షన్ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో అన్ని ఫ్రాంచైజీల దృష్టి కొందరు క్రికెటర్లపై ఉంది. ఐపీఎల్ 2021 లో సత్తా చాటిన టాప్ 5 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మెగా ఆక్షన్‌లో వీరికే ఎక్కువ అవకాశాలున్నాయి.

IPL Mega Auction: ప్రపంచంలోనే అత్యధికంగా చూసేది ఐపీఎల్. దేశ విదేశాల్లోని క్రికెటర్లు తమ తమ ప్రతిభ చాటేందుకు అద్భుతమైన వేదిక ఇది. ఇప్పటికే ఐపీఎల్ 2021 ముగిసింది. ఎవరి సత్తా ఏంటనేది చూశాం. ఇక ఐపీఎల్ 2022 కోసం మెగా ఆక్షన్ కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో అన్ని ఫ్రాంచైజీల దృష్టి కొందరు క్రికెటర్లపై ఉంది. ఐపీఎల్ 2021 లో సత్తా చాటిన టాప్ 5 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మెగా ఆక్షన్‌లో వీరికే ఎక్కువ అవకాశాలున్నాయి.

1 /5

Glenn Maxwell న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్ 2021లో 15 మ్యాచ్‌లు ఆడి 513 పరుగులు సాధించాడు. 

2 /5

Shikhar Dhawan ఇక మరో ఆటగాడు శిఖర్ ధావన్. టీమ్ ఇండియా ప్రమాదకర బ్యాట్స్‌మెన్లలో ఒకడు. ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ఆడాడు. ఐపీఎల్ 2021లో 16 మ్యాచ్‌లు ఆడి..587 పరుగులు సాధించాడు. 

3 /5

KL Rahul ఇండియా టాప్ స్టార్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు కేఎల్ రాహుల్. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు సారధిగా ఉన్నాడు. 13 మ్యాచ్‌లు ఆడి 626 పరుగులు సాధించాడు. మెగా ఆక్షన్‌లో రాహుల్‌కు భారీ ధరే ఉండవచ్చు.

4 /5

Faf Du Plessis దక్షిణాఫ్రికాకు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డుప్లెసిస్..చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2021లో అద్భుతంగా రాణించాడు. సీఎస్కే తరపున డుప్లెసిస్ 16 మ్యాచ్‌లలో 633 పరుగులు చేశాడు. కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సీఎస్కే ఇతడిని రిటర్న్ చేయకపోతే అందరి దృష్టీ డుప్లెసిస్‌పైనే ఉంటుంది. 

5 /5

Ruturaj Gaikwad చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రుతురాత్ గైక్వాడ్ ఐపీఎల్ 2021లో అందరికంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇతడు 16 మ్యాచ్‌లు ఆడి 136.26 స్ట్రైక్‌రేట్‌తో 635 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ సాధించాడు. తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ సెంచరీ కూడా సాధించాడు.