BJP wants to resume Dalit Bandhu: హుజూరాబాద్​ ఉప ఎన్నిక ముగిసిన (Huzurabad By Polls) తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయంగా రగడ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికల విజయం సాధించిన బీజేపీ (Telangan BJP).. అధికార టీఆర్​ఎస్​ పార్టీపై మరోసారి విమర్శలు (BJP vs TRS) గుప్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ వల్లే దళితబంధు ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారంటూ టీఆర్​ఎస్ పార్టీపై.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ కుమార్​ ఆరోపణలు చేశారు.


అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు (Dalita bandhu scheme) అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 4 నుంచి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR on Dalita bandhu) చెప్పినట్లు ఉన్న ఓ వీడియోను చూయించారు.


దళితబంధు అమలుతో పాటు.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ (Job Notification) ఇవ్వకపోతే ఈ నెల 12న లక్షలాది మందితో మిలియన్‌మార్చ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు బండి సంజయ్​. 21 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.


Also read: Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్


Also read: Etela Rajender Won the By Elections: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం


హుజూరాబాద్​లో గెలుపుతో బీజేపీకి మరింత జోష్​..


రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నికలకో రఘునందన్ రావును గెలిపించి.. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా ఛాటింది బీజేపీ. ఇప్పుడు మరోసారి హుజూరాబాద్​లో విజయం సాధించి.. మరింత జోష్​తో ముందుకు సాగుతోంది.


Also read: Minister KTR: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..


Also read: Huzurabad by-poll results: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీష్ రావు స్పందన


గెలుపుపై ఈటల ఎమన్నారంటే..


ఆత్మగౌరవ నినాదంతో హుజూరాబాద్ ఉపఎన్నికను (Huzurabad by Elections) ఎదుర్కొన్న ఈటల రాజేందర్... (Etela Rajender) ప్రజలు తనకు పట్టం కట్టడంతో ఆత్మగౌరవ బావుటా ఎగరేసినట్లయిందన్నారు. గొప్ప మెజారిటీతో తనను ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు. ప్రజలు తమ తీర్పుతో టీఆర్ఎస్‌ను (TRS) బొందపెట్టారని అన్నారు.


నా బొమ్మ, నా గుర్తుపై గెలిచాడంటూ తనను గడ్డిపోచలా తీసిపారేసిన కేసీఆర్‌కు ఇప్పుడు తానేంటో అర్థమైందన్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఏరులైపారిన మద్యం, రూ.వందల కోట్ల డబ్బును తోసిరాజని... ప్రజలు తనవైపు నిలిచారని అన్నారు.


Also read: Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం


Also read: Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కారణాలివేనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook