Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్

హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.. అయితే గెల్లు శ్రీనివాస్ ఓటమి కారణంగా అనుచరుల వద్ద ఏడ్చినట్లు కనపడుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 11:09 AM IST
  • 24,068 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఈటెల రాజేందర్
  • గెల్లు శ్రీనివాస్ ఏడుస్తున్న వీడియో వైరల్
  • వీడియో ఎంత వరకు నిజమో తెలియకున్న వైరల్ అయిన వీడియో
Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్

Gellu Srinivas Yadav Emotional got Viral: నవంబర్ 2వ తేదీన హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ( Huzurabad By elections)జరగటం... బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender) టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas) పై 24,068 ఓట్ల మెజారిటీతో గెలవటం మన అందరికి తెలిసిందే! అయితే ప్రభుత్వ పథకాలు, హరీష్ రావు (Harish Rao) వంటి ఓటమి ఎరగని నాయకులు ప్రచారం చేసినప్పటికీ.. హుజురాబాద్ ప్రజలు మాజీ మంత్రి ఈటెలకు పట్టం కట్టారు 

ప్రజల మద్దతు ఉందన్న నమ్మకంతో ఈటెల రాజేందర్ తన సొంత పార్టీ టీఆర్ఎస్ (TRS) ను వదిలి బీజేపీలో (BJP) చేరి... హుజురాబాద్ లో (Huzurabad) మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఈటెల రాజేందర్ కు 1,06,780 వేల ఓట్లు పోల్ అవ్వగా .. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ 82,712 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు, కాంగ్రెస్ పార్టీ (Congress) అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవటం గమనార్హం. 

Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. ?

అయితే ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.. 'సౌమిత్ యక్కటి' (Soumith Yakkati) అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గెల్లు శ్రీనివాస్ అనుచరుల ముందు ఏడుస్తున్నట్లు ఉంది. ఇది ఎంత వరకు నిజమో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

హుజురాబాద్ బై ఎలక్షన్స్ ఫలితాల సమయంలో 9 వ రౌండ్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ 5 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్న సమయంలో గెల్లు శ్రీనివాస్ కంటతడి పెట్టినట్టు ఈ వీడియోలో ఉంది.. ఫలితాలు టీఆర్ఎస్ ప్రతికూలంగా రావటం కారణంగా ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. 

Also Read: India vs Afghanistan: చావా రేవో..టీమ్ కీలక మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో నేడే

ఉప ఎన్నికల ఫలితాల తరువాత మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజురాబాద్ లో ఎన్నికల్లో నైతిక విజయం టీఆర్ఎస్ దే అని.. కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేయటం వల్లే ఇలా ఫలితాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News