Harish Rao about Huzurabad by-poll results: హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ... ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు (Gellu Srinivas Yadav) ఓట్లు వేసిన వాళ్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పాటుపడిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపి గెలుపును బీజేపి, కాంగ్రెస్ పార్టీల విజయంగా అభివర్ణించిన మంత్రి హరీష్ రావు.. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేశాయని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad by-polls results live udates) బీజేపి, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటయ్యాయనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారని చెప్పారు. యావత్ రాష్ట్ర ప్రజలంతా బీజేపి, కాంగ్రెస్ పార్టీల వైఖరిని గమనిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.
Also read : Huzurabad by-poll results live updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం
ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటింగ్ శాతం తగ్గలేదని... ఏది ఏమైనా టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోయే పార్టీ కాదని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడిన నాడు కుంగిపోయేది లేదు. గెలిచినా, ఓడినా.. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) స్పష్టంచేశారు.
Also read : Huzurabad by-poll result live updates: ఈటల రాజేందర్‌కి ఏయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందంటే..
Also read : Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి