Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కారణాలివేనా

Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార పార్టీకు ఘోర పరాజయం ఎదురైంది. బీజేపీ మరోసారి విజయం సాధించింది. హుజూరాబాద్ ఓటమి టీఆర్ఎస్‌లో అంతర్మథనానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అసలెందుకిలా జరిగింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 3, 2021, 01:32 PM IST
  • హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమితో టీఆర్ఎస్‌లో అంతర్మథనం
  • అన్ని జాగ్రత్తలు తీసుకున్నా..టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది
  • త్వరలో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కారణాలివేనా

Huzurabad Result Review: హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార పార్టీకు ఘోర పరాజయం ఎదురైంది. బీజేపీ మరోసారి విజయం సాధించింది. హుజూరాబాద్ ఓటమి టీఆర్ఎస్‌లో అంతర్మథనానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అసలెందుకిలా జరిగింది.

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నువ్వా నేనా రీతిలో సాగిన ఉపఎన్నిక హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad Bypoll).ఈటెల రాజేందర్ రాజీనామా నుంచి నాలుగు నెలలుగా ఎత్తులు, పైఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాలకు అధికార పార్టీ పదును పెట్టినప్పటికీ విజయం వరించలేదు. ఈటెల వర్సెస్ కేసీఆర్‌గా జరిగిన ఎన్నికలో ఈటెల విజయం సాధించారు. ఏకంగా 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఈటెల విజయం టీఆర్ఎస్‌కు మింగుడుపడటం లేదు. ఇప్పుడా పార్టీ అంతర్మథనంలో పడింది. అసలెందుకిలా జరిగిందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే పైకి మాత్రం టీఆర్ఎస్ ఓట్లేమీ తగ్గలేదని..బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్(KCR to Review on Huzurabad Result) పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. 

అవినీతి ఆరోపణలతో ఈటెల రాజేందర్‌ను (Etela Rajender)మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ చాలా విషయాల్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఈటెల రాజేందర్ అవినీతి అక్రమాలు, కేసీఆర్‌కు నమ్మకద్రోహం చేసేందుకు కుట్ర పన్నడం వంటి విషయాలున్నాయని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. ఉపఎన్నికను ముందు నుంచీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల్ని హుజూరాబాద్‌లో మొహరించింది. గతంలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ ఓడిపోయినప్పటికీ.. కొంత ఏమరుపాటు, అతివిశ్వాసమే ప్రధానంగా కొంప ముంచిందన్న అంచనాకు వచ్చారు. అందుకే ఈసారి హుజూరాబాద్‌లో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతీ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ఎత్తులు, పైఎత్తులు వేసినప్పటికీ.. విజయం సాధించలేకపోయింది. అంత జాగ్రత్తగా ఉన్నా ఎందుకు ఓడిపోయామనే అంతర్మథనం మొదలైంది.

మరోవైపు దళితబంధు(Dalitha bandhu scheme)పధకంతో దళితులకు అగ్రతాంబూలమేసింది. అభివృద్ధి, సంక్షేమం మంత్రాన్ని పటిస్తూనే.. బ్రహ్మాస్త్రంగా దళితబంధుతో ముందుకొచ్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఏ ఎన్నిక ఫలితాల రోజయినా... సంబరాలతో సందడిగా ఉండే తెలంగాణ భవన్ బోసిపోయి కనిపించింది. ఇప్పటికే ఎందుకు గెలవలేదనే అంశంపై తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించారు. హరీశ్‌రావుతో(Harish rao) పాటు ముఖ్య నేతలతో చర్చించారు.

ఎందుకు గెలవలేకపోయింది

తెరాసకు(TRS) ఓట్లు తగ్గలేదని ఈటెల రాజేందర్‌పై నియోజకవర్గంలో ఏర్పడిన సానుభూతి కారణమని తెరాస నేతలు భావిస్తున్నారు. ఎన్నిక ఈటెల రాజేందర్‌తో కాదు.. భాజపాతో అని ప్రచారం చేసినప్పటికీ ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయలేకపోయినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్ అంతర్గతంగా కలిసి పనిచేశాయని తెరాస ఆరోపిస్తోంది. వాస్తవానికి పోలింగ్​కు కొన్ని రోజుల ముందు నుంచే తెరాస ఈ అంశాన్ని ప్రచారం చేసింది. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి (Revanth Reddy)కలుసుకున్నారని.. భాజపా, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఫలితాల వెల్లడి తర్వాత హరీశ్‌రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ధ్వజమెత్తారు. మరోవైపు హుజూరాబాద్ ఓటమి పార్టీ శ్రేణుల్ని నిరాశపర్చకుండా ఉండేందుకు టీఆర్ఎస్ అప్రమత్తమైంది. హుజూరాబాద్ ఫలితం అంతగా ప్రాధాన్య అంశం కాదని..ఇరవై ఏళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు. భవిష్యత్ పోరాటాలకు కార్యకర్తలు మరింత ఉత్సాహంగా సన్నద్ధం కావాలన్నారు. ఈ ఒక్క ఓటమితో తెరాస కుంగిపోదని.. గెలిస్తే పొంగిపోయి.. ఓడితే కుంగిపోయే పార్టీ కాదని హరీశ్‌రావు ప్రకటన జారీ చేశారు. 

Also read: Raghuveera reddy: ఆయనకు ఏమైంది, ఎందుకు స్థంభానికి కట్టేశారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News