Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం

Siddipet collector comments on paddy seeds sale: రైతులకు వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ఇది రైతులకు వ్యతిరేక నిర్ణయం అయినందున దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2021, 06:16 PM IST
Paddy seeds sale విషయంలో సిద్ధిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై TS High court ఆగ్రహం

Siddipet collector comments on paddy seeds sale: హైదరాబాద్: యాసంగి వరి విత్తనాల విక్రయాల విషయంలో సిద్దిపేట కలెక్టర్ చేసిన వాఖ్యలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రైతులకు వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ఇది రైతులకు వ్యతిరేక నిర్ణయం అయినందున దీనిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ (Telangana AG BS Prasad) వాదనలు వినిపించారు. సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషనర్ రైతుల సమస్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

వరి విత్తనాల విక్రయాలను ప్రొహిబిషన్ యాక్టులో ఏమైనా చేర్చారా అని హైకోర్టు ప్రశ్నించగా.. అలాంటిది ఏమి లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదని కోర్టుకు చెప్పిన ఏజీ బిఎస్ ప్రసాద్... ఇకపై కూడా ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోబోదని కోర్టుకు తెలిపారు.

Also read : Huzurabad By Election Result Live Counting: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

రైతులు పండించే పంటల ఎంపిక విషయంలో కలెక్టర్ (Siddipet collector comments on sale of paddy seeds) ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించిన హైకోర్టు.. కలెక్టర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందన్న హైకోర్టు (Telangana High court).. ఈ పిటీషన్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

Also read : Huzurabad by-poll result live updates: ఈటల రాజేందర్‌కి ఏయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందంటే..

Also read : Badvel, Huzurabad Counting updates: బద్వేలు, హుజూరాబాద్‌లో అధికారపార్టీల ఆధిక్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News