కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలు లేని వారితోనే అధిక ముప్పు పొంచి ఉందని సర్వేలు చెబుతున్నాయి. 95 శాతం మందిలో బి క్లేడ్ స్ట్రెయిడ్ రకం వైరస్ ఉన్నట్లుగా హైదరాబాద్(Hyderabad)లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ అండ్ డయాగ్నోస్టిక్స్ (Centre for DNA Fingerprinting And Diagnostics) సర్వేలో తేలింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో మే, జూన్ నెలలలో కోవిడ్19 (COVID19) బారిన పడిన కొందరు పేషెంట్ల వివరాలను సేకరించి పూర్తిగా విశ్లేషణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సోకినా.. లక్షణాలు కనిపించని వారిలో రోగ నిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల వారు ఆరోగ్యంగా కనిపిస్తారని, అదే సమయంలో వీరి నుంచి వైరస్ ఇతరులకు సోకి మరణాలు పెరిగే అవకాశాలున్నాయిని గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 57 వేల మంది కరోనా వైరస్ బారిన పడగా కేవలం 30 శాతం మందిలోనే కోవిడ్19 లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు కనిపించాయి. 



అంటే 70 శాతం పేషెంట్లలో ఏ లక్షణాలు కనిపించలేదు. కరోనా లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికంగా ఉందని, వీరి నుంచి వృద్ధులు, చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కరోనా వైరస్ వ్యాపించి వారి చావుకు కారణం అవుతున్నారట. ఈ విషయాన్ని నగరంలోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ శాస్త్రవేత్తలు గుర్తించి హెచ్చరిస్తున్నారు. 



కాగా, నగరంలోని కోవిడ్19 బాధితుల నమూనాలు పరీక్షించగా 95 శాతం మందిలో బిక్లేడ్ అనే స్ట్రెయిన్‌కు చెందిన కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. కేవలం 5శాతం మందిలోనే ఇతర స్ట్రెయిన్‌లకు చెందిన వైరస్ ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైతేనేం రోగ నిరోధక శక్తి పెంచుకునేలా చూసుకోవడంతో పాటు, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని.. టీకా వచ్చే వరకు ప్రత్యామ్నాయం లేదని సూచిస్తున్నారు.  Malaika Arora: అభిమానులకు మలైకా అరోరా శుభవార్త


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR