Colonel Santosh Babu: మిలిటరీ విమానంలో కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం తరలింపు
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్‌లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి తరలించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సంతోష్ బాబు పార్థివ దేహం హకీంపేట లో ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎయిర్ బేస్‌కి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు.
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట : లడాఖ్‌లోని భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ వ్యాలీలో భారత సైనికులు, చైనా సైనికులకు మధ్య జరిగిన హోరాహోరి ఘర్షణలో ( Indian Army vs Chinese troops ) వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఇండియన్ ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించి.. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి కానీ లేదా బేగంపేట ఎయిర్ పోర్టుకు కానీ తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు తరలించనున్నట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ తెలిపారు. బుధవారం ఉదయం ఏ సమయంలోనైనా సంతోష్ పార్థీవదేహం సూర్యాపేటకు చేరుకోనున్నట్టు భాస్కరన్ పేర్కొన్నారు. ( చైనా బలగాలతో ఘర్షణలో తెలుగు బిడ్డ వీర మరణం )
కల్నల్ సంతోష్ బాబు మృతితో సూర్యాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇకలేడనే బాధ వేధిస్తున్నప్పటికీ... తన కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం కూడా ఉందన్నారు అమరుడైన సంతోష్ బాబు తల్లి మంజుల ( Martyred colonel Santosh Babu`s mother). సంతోష్ తండ్రి బిక్కుమల్ల ఉపేందర్ మాట్లాడుతూ.. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనే తన కోరిక నెరవేరలేదని... అందుకే తన కొడుకుని ఆర్మీకి పంపించానని అన్నారు. బంధువులు వద్దని వారిస్తున్నా.. తాను మాత్రం తన కొడుకుని దేశ సేవకే పంపించానని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
( India vs China: చైనా బలగాలతో ఘర్షణలో 20 మంది భారత సైనికుల వీర మరణం )
ఇదిలావుంటే మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు ( Colonel Santosh Babu`s cremation) జరిగిపోతున్నాయి. వీర మరణం పొందిన సైనికుడికి ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం మిలిటరీ లాంఛనాల ( Military honors) మధ్య అంతిమ వీడ్కోలు పలికేందుకు పలువురు ఆర్మీ అధికారులు కూడా సూర్యాపేట చేరుకుంటున్నారు. సంతోష్ బాబు అంత్యక్రియల ఏర్పాట్లలో ఆర్మీ అధికారులు సైతం పాల్గొంటున్నారు.
( India vs China: స్పందించిన ఇండియన్ ఆర్మీ )
దేశం కోసం సైన్యంలో పనే చేసేందుకు వెళ్లి అమరుడైన సంతోష్ బాబు అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా హాజరయ్యే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్.. సూర్యాపేట జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంతోష్ బాబు పార్థివదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డి ప్రభుత్వ ప్రతినిధిగా సంతోష్ బాబు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..