చైనా బలగాలతో ఘర్షణలో తెలుగు బిడ్డ వీర మరణం

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు 

Last Updated : Jun 17, 2020, 01:53 AM IST
చైనా బలగాలతో ఘర్షణలో తెలుగు బిడ్డ వీర మరణం

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధులు నిర్వహిస్తోన్న సంతోష్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఆయన మరణవార్తతో సూర్యాపేటలో సంతోష్ కుటుంబం నివసించే విద్యానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక సంతోష్ మరణంపై తల్లి మంజుల స్పందిస్తూ నా కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది. దేశం కోసం నా కుమారుడి ప్రాణాలు పోయాయి. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం బాధిస్తోంది. కానీ దేశం కోసం కుమారుడు చనిపోయినందుకు గర్వంగా ఉందంటూ బోరున విలపించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News