Father In Law Attack: కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో రగిలిపోయాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అల్లుడిని హతమార్చాలని చూస్తున్నాడు. అతడిని అంతమొందించాలని చూస్తున్న క్రమంలో అదును దొరికింది. సమయం చిక్కడంతో కొత్త అల్లుడిపై మామ విరుచుకుపడ్డాడు. ఆస్పత్రిలో ఉన్న అల్లుడిపై బీరు బాటిల్‌తో మామ దాడికి పాల్పడ్డాడు. అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: K Kavitha: కేటీఆర్‌ ఈ కేసు నుంచి నిప్పు కణికల్లా బయటకు వస్తారు


ఖమ్మం నగరంలోని సీతా తండకు చెందిన గుగులోత్ అశోక్ (24) అజయ్ తండాకు చెందిన మానస(19) ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ నవంబర్ ఎనిమిదో తేదీన  ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదురించి వివాహం చేసుకోవడంతో మానస కుటుంబసభ్యులకు నచ్చలేదు. తన కూతురు చేసిన పనికి సహించలేని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అల్లుడు అశోక్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.


Also Read: HCA: క్రికెట్‌కు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేస్తాం: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం


అయితే మానసకు తరచూ కడుపులో నొప్పి వస్తుండడంతో అశోక్ ఖమ్మంలోని ఓ ఆసుపత్రి తీసుకెళ్లాడు. ఆమె కడుపులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కణితి తొలగించాలని శస్త్ర చికిత్స అవసరం చెప్పడంతో అశోక్‌ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంకటేశ్వర్లు హాస్పిటల్ కి చేరుకున్నారు. కోపంతో ఉన్న మామ వెంకటేశ్వర్లు ఇదే అదును అని భావించి అక్కడ కనిపించిన కొత్త అల్లుడు అశోక్‌పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు.


ఊహించని ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు. దాడి చేయడంతో అశోక్‌కు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దాడి చేసిన మామ వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.