K Kavitha: కేటీఆర్‌ ఫార్ములా ఈ కారు కేసు నుంచి నిప్పు కణికలా బయటకు వస్తారు

K Kavitha Hot Comments KT Rama Rao Formula E Car Case: 'అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. తనలాగే కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 29, 2024, 02:19 PM IST
K Kavitha: కేటీఆర్‌ ఫార్ములా ఈ కారు కేసు నుంచి నిప్పు కణికలా బయటకు వస్తారు

Kalvakuntla Kavitha: 'తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం.. దమ్ములేక తపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని తెలిపారు. తాము తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని పేర్కొన్నారు.

Also Read: HCA: క్రికెట్‌కు తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌గా తయారుచేస్తాం: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం

అక్రమ కేసులో అరెస్టయి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి నిజామాబాద్‌ పర్యటనకు కవిత వచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదు' అని గుర్తుచేశారు.

Also Read: Vemulawada: వేములవాడలో భక్తుల నిలువు దోపిడీ.. కోడెమొక్కుకు వసూళ్ల పర్వం

'పేరు మర్చిపోయినా.. రైతులు భూములు ఇవ్వకపోయినా రేవంత్‌ రెడ్డి కేసులు పెడుతున్నాడు. ప్రభుత్వానికి ఎందుకింత భయం? ' అని కవిత ప్రశ్నించారు. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారనే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని విమర్శించారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లం. గట్టిగా నిలబడుతాం. ప్రజల పక్షనా పోరాటం చేస్తాం' అని ప్రకటించారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది? అని నిలదీశారు.

'మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదు' అని కవిత గుర్తుచేశారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు... ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. 'విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. పీపుల్స్ ఫ్రెండ్లీ  పోలిసింగ్ పోయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోంది. రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తున్నది.

'కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలి. రాబోయేది గులాబీ జెండా శకమే. అందులో సందేహమే లేదు' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే జ్యోషం చెప్పారు. 'గురుకులాలను పడడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు?' అని మండిపడ్డారు. ఉద్యోగాల పేరిట రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని గుర్తుచేశారు.

'తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి. తెలంగాణ తల్లి మాదిరా.. కాంగ్రెస్ తల్లి మీదిరా. మన పొట్టమీదనే కాదు మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నది. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదు. మళ్లొకసారి నిజామాబాద్ పవర్‌ను రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దాం' అని కవిత చెప్పి గులాబా పార్టీ శ్రేణుల్లో జోష్‌నిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News