JNTUH Exams | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయగుండం కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలతో హైదరాబాద్, సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భారీ వర్షాల దృష్ట్యా జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTU)  పరీక్షలు వాయిదా వేశారు. అక్టోబర్ 14, 15న యూజీ, పీజీ రెగ్యూలర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా (JNTUH Exams postponed) వేసినట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది.


Hyderabad Rains: నగరంలో 11కు చేరిన మృతుల సంఖ్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఈ పరీక్షల వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వర్సీటీ పేర్కొంది. ఈ పరీక్షల వాయిదాతో ఇతర పరీక్షల షెడ్యూల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఓ ప్రకటనలో జేఎన్‌టీయూ ఈ వివరాలు వెల్లడించింది. 


Telangana Covid-19: తాజాగా 1,446 కరోనా కేసులు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe