Secunderabad violence Accused Arrested: సికింద్రాబాద్‌లో విధ్వంసానికి పాల్పడిన నిందితుల గుర్తింపు, అరెస్ట్

Sat, 18 Jun 2022-6:54 pm,

Agnipath Protests Live Updates: సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ పథకం అల్లర్ల వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడానికంటే ముందుగానే వారి వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసం గురించి వ్యూహరచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Agnipath Protests Live Updates: సికింద్రాబాద్‌లో అగ్నిపథ్ పథకం అల్లర్ల వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడానికంటే ముందుగానే వారి వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసం గురించి వ్యూహరచనలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్న ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటానికి అవసరమైన వస్తు, సామాగ్రిని తీసుకురావాల్సిందిగా ఒకరికొకరు చెప్పుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వార్తా కథనం చదవండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Agnipath Violence: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే మాస్టర్ ప్లాన్? అందుకేనా హైదరాబాద్ పోలీసులు సైలెంట్?


Also read : Agnipath Protests: సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణ.. అల్లర్లపై కేసు నమోదు

Latest Updates

  • Secunderabad violence Accused Arrested: సికింద్రాబాద్‌లో విధ్వంసానికి పాల్పడిన నిందితుల గుర్తింపు, అరెస్ట్

    Secunderabad violence Accused Arrested: సికింద్రాబాద్ అల్లర్ల కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఆందోళనకారుల వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుల నెంబర్లతో పాటు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల విజువల్స్ ఆధారంగా  200 మంది ఆందోళనకారులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జాబితాలో ఉన్న వారిలో దాదాపు 100 మంది నేడు రిమాండ్‌కి తరలించే అవకాశాలు ఉన్నాయి. విధ్వంసంలో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించడంలో వారి వాట్సాప్ గ్రూప్ తమకు బాగా ఉపయోగపడిందని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ, రేపు భారీ ఎత్తున అరెస్టులు కొనసాగనున్నాయి. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి నివాసంలో నిందితులను హాజరు పరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

  • Bandi Sanjay About Agnipath Protests: సీఎం క్యాంప్ ఆఫీసు నుంచే సికింద్రాబాద్ విధ్వంసానికి స్కెచ్ : బండి సంజయ్

    Bandi Sanjay Comments on Agnipath Protests: సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లపై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. అగ్నిపథ్ పథకంపై బురద జల్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయవచ్చని టీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రే సికింద్రాబాద్ విధ్వంసం అని బండి సంజయ్ మండిపడ్డారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • Secunderabad Agnipath Protests Mastermind: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనుకున్న మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు ఏపీలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమి నిర్వాహకుడైన సుబ్బారావుని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం.. Read: Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?

  • Revanth Reddy Arrested at Ghatkesar: అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తంచేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లకు పాల్పడిన వారిని నిలువరించే క్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్ బయల్దేరిన రేవంత్ రెడ్డిని ఘట్‌కేసర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాకేశ్‌ని చంపింది టీఆర్ఎస్ పార్టీ అయితే.. చంపించింది బీజేపి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link