తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజా సేవలో అంకిత భావంతో పని చేస్తోంది అని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ( Etela Rajender ). వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) నియమించిన మంత్రిమండలి ఉపకమిటీ ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు కేంద్రలో సమావేశం అయింది. ఈ భేటీలో ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసారి శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి


బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది


కోవిడ్-19 ( Covid-19 ) సంక్రమణ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సేవల గురించి మాట్లాడిన ఈటెల రాజేందర్.. వైద్యారోగ్య శాఖ ఏడాది పొడవునా నిర్విరామంగా పని చేసే శాఖ అని తెలిపారు. గత ఆరు మాసాలుగా ప్రజలు ఇంటికి పరిమితం అయితే వైద్యారోగ్య శాఖ మాత్రం సేవలో నిమగ్నం అయింది అని పేర్కొన్నారు. అయితే ఆరోగ్య శాఖను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన సూచనలు చేశారని పేర్కోన్నారు. 


వైద్యారోగ్య సిబ్బందికి ధన్యవాదాలు: కేటీఆర్


ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ( KTR ) ఆరోగ్య శాఖను ప్రశంసించారు. ప్రజారోగ్యం కోసం పని చేస్తున్న ఆరోగ్యశాఖ సిబ్బందికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో వైద్యారోగ్య శాఖలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. కరోనావైరస్ ( Coronavirus ) విషయంలో ప్రజలకు మంచి అవగాహన వచ్చింది అని..ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వైరస్ సంక్రమణ అదుపులో ఉంది అన్నారు.



ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR