KT Rama Rao: మన్మోహన్ సింగ్‌ను అవమానించిన రాహుల్ గాంధీ.. ఇది తగునా అంటూ కేటీఆర్ ఆగ్రహం
Rahul Gandhi Vietnam Trip Turns Politics KTR Slams: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్‌పై విమర్శలు చేశారు.
Rahul Gandhi Vietnam Trip: దేశానికి గొప్ప సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అవమానించారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశం విషాదంలో ఉన్న వేళ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేయడంపై మండిపడ్డారు. సంతాప దినాలు కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మరోసారి మన్మోహన్ సింగ్‌ను రాహుల్ గాంధీ అవమానించారని తెలిపారు.
Also Read: New Year Alert: న్యూ ఇయర్‌కు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు మూసివేత
రాహుల్ గాంధీ వియత్నా పర్యటనపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశం మొత్తం విషాదంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వియత్నం పర్యటన చేయడం ఆశ్చర్యకరం. పార్టీ కోసం.. దేశం కోసం జీవితాంతం సర్వస్వం ధారపోసిన నాయకులను అవమానపరచడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది' అని కేటీఆర్ విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీ అంటేనే మహనీయులను అవమానపరచడం' అని కేటీఆర్ గుర్తుచేశారు. స్వర్గీయ పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో 14 శాతం కమీషన్ ఇస్తేనే పనులు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
ఇక గురుకులాల్లో దారుణ పరిస్థితులపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు భోజనం లేక రోదిస్తున్న వీడియోను పంచుకుంటూ కేటీఆర్ అసమర్థ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 'అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా! కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన నా తెలంగాణలో పట్టెడన్నం కోసం పసిబిడ్డల ఆర్తనాదాలా!' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
'దశాబ్దాల కాంగ్రెస్ పాలన మూలంగా ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. వలసలు.. అంబలికేంద్రాలకు నిలయమైన తెలంగాణను పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే అన్నపూర్ణగా నిలిపాం' అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నమో రామచంద్రా అని ఆకలికేకలా! అని ప్రశ్నించారు. 'పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకులాల్లో చదువుకుని ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహించి.. వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటిన విద్యార్థులు.. నేడు గుప్పెడన్నం కోసం గుండెలవిసేలా రోదించడమా!. సిగ్గు సిగ్గు. పాలకుల పాపం.. విద్యార్థులకు శాపం' అని కేటీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook