New Year Celebrations: కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. పార్టీలు.. విందులు.. చిందులు.. డీజే చప్పుళ్లతో మార్మోగనుంది. ఇప్పటికే ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకోగా.. వారికి పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం.. మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు ట్రాఫిక్ అంశాలపై కూడా కీలక సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పై వంతెనల మూసివేత ఉంటుందని వెల్లడించారు.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో 14 శాతం కమీషన్ ఇస్తేనే పనులు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్ నగరంలోని ఫ్లైఓవర్లను డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రాత్రి మొత్తం మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీతోపాటు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఐటీ కారిడార్లతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
Also Read: KT Rama Rao: నన్ను జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి లక్ష్యం.. అవినీతి లేదు ఏం లేదు
న్యూ ఇయర్ జోష్‌లో ర్యాష్‌గా వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. దీంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కూడా చర్యలు తీసుకోనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నారు. వీటితోపాటు సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్‌పై కూడా పోలీసులు నిఘా ఉంచనున్నారు. న్యూ ఈయర్‌కు ఆనందంతో స్వాగతం పలుకుదామని.. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
మూసి ఉండే ఫ్లైఓవర్లు
- లోయర్ ట్యాంక్‌బండ్‌స్టీల్ బ్రిడ్జ్
- తెలుగు తల్లి ఫ్లైఓవర్
- మాసాబ్‌ట్యాంక్
- బేగంపేట, రసూల్‌పుర ఫ్లైఓవర్లు
- దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్
- టౌలిచౌకి ఫ్లైఓవర్
- గచ్చిబౌలి ఫ్లైఓవర్
- జూపార్క్ మార్గంలోని ఫ్లైఓవర్లు
ఫామ్‌హౌస్‌లు.. రిసార్ట్‌లలో తనిఖీలు
కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీలకు సిద్ధమైన పలు ఫామ్‌హౌస్‌లు.. రిసార్ట్‌లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతాలలో పోలీసులు సోదాలు చేశారు. ఫామ్‌హౌస్‌లు.. రిసార్ట్‌లలో రాచకొండ పోలీసుల తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పార్టీలలో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.