Karimnagar: 'కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదు. కాంగ్రెస్ సర్కార్ కమీషన్ సర్కార్. 14 శాతం కమీషన్ ఇవ్వనిదే బిల్లులు మంజూరు కావడం లేదు' అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ విషయంలో మంత్రుల మధ్యే యుద్ధం మొదలైందని సంచలన ప్రకటన చేశారు. మాజీ సర్పంచ్‌లకు బిల్లులివ్వకుండా నిండా ముంచిందని మండిపడ్డారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులన్నీ మాజీ సర్పంచ్‌లు చేసినవేనని స్పష్టం చేశారు.
Also Read: KT Rama Rao: నన్ను జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి లక్ష్యం.. అవినీతి లేదు ఏం లేదు
కరీంనగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలతోపాటు ఆరోపణలు చేశారు. 'మాజీ సర్పంచ్‌లకు బిల్లులివ్వకుండా అప్పుల పాల్జేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తాం. చేతగాని కాంగ్రెస్ సర్కార్ వల్లే రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగింది. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలాడుతోంది' అని మండిపడ్డారు.
Also Read: Harish Rao: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను కంటతడి పెట్టించింది
'కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు దండుకుంటోంది' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. నిజాయతీగా ఉన్న కొందరు మంత్రుల్లో ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదని పేర్కొన్నారు. 'కమీషన్లపై కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం నడుస్తోంది. ఎప్పుడైనా కమీషన్ల బాగోతం బద్దలు కావొచ్చు' అని కీలక వ్యాఖ్యలు చేశారు. 'కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారు. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారు' అని మండిపడ్డారు.
'ఈ ప్రభుత్వాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదనే సంగతి గుర్తుంచుకోవాలి' అని బండి సంజయ్ తెలిపారు. పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే వాళ్లకు 8 నుంచి 14 శాతం కమీషన్లు ఇస్తే మీ నిధులన్నీ విడుదలవుతాయని పేర్కొన్నారు. కమీషన్లు దండుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మంత్రులను పెట్టుకున్నారు అని చె్పారు. 14 శాతం కమీషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్లకే బిల్లులు మంజూరవుతున్నాయని పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి పాలనతో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు.
'ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. శాంతి భద్రతలను కాపాడలేని చేతగాని రేవంత్ రెడ్డి పాలన నడుస్తోంది. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు' అని బండి సంజయ్ తెలిపారు. మన్మోహన్ సింగ్, అంబేడ్కర్‌లను బీజేపీ అవమానించిందంటూ వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. 'అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు?' అని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓడించారు? అని నిలదీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.