Revanth Reddy in PCC chief race: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఖాయమేనా ?
Revanth Reddy to be next PCC chief ? : హైదరాబాద్: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందనే వార్తలు రావడం ఇవాళ కొత్త కాదు... కాకపోతే ప్రస్తుతం పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించిన నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారం తెరపైకొచ్చింది.
Revanth Reddy to be next PCC chief ? : హైదరాబాద్: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశాలు ఉన్నాయంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉందనే వార్తలు రావడం ఇవాళ కొత్త కాదు... కాకపోతే ప్రస్తుతం జాతీయ స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ).. ఆ తర్వాత రాష్ట్రాల వారిగానూ దృష్టిసారించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న చోట పార్టీని పటిష్టపరిచేందుకు నడుం బిగించిన సోనియా గాంధీ.. అవసరమైన చోట రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ నాయకత్వాన్ని మార్చి వారి స్థానాల్లో మరొకరికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. Also read : Revanth Reddy's open letter: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖతో ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక
ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనా ( PCC chief Uttam Kumar Reddy ) పలువురు నేతలు అసంతృప్తితో ఉండటం, లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన పేలవంగా ఉండటం వంటివి సోనియా దృష్టిలో ఉన్నాయని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఆర్సీ కుంతియాను ( RC Khuntia ) ఆ స్థానం నుంచి తప్పించి మాణిక్యం ఠాకూర్‌ని ( MP Manikyam Thakur ) ఇంచార్జుగా నియమించడానికి కారణం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా కుంతియా పని తీరు సరిగ్గా లేకపోవడమేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పీసీసీని కూడా మారుస్తారని.. అదే కానీ జరిగితే రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) పీసీసీ చీఫ్ పదవి ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. Also read : Revanth Reddy: కేసీఆర్, జగన్‌లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కకు పెడితే.. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి పేరే ప్రముఖంగా వినిపిస్తుండటమే అందుకు కారణమైంది. తెలంగాణలో అనేక సందర్భాల్లో అధికార పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పైనా దూకుడు ప్రదర్శించే నేతల్లో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటుండమే ఆయన్ను పీసీసీ రేసులోనూ ముందంజలో నిలబెట్టిందనేది ఆ వార్తా కథనాల సారాంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సొంత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, అవినీతి, ఇతర ఇబ్బందులు తప్పడం లేదని.. సీఎం కేసీఆర్ ( CM KCR ) వైఖరి ఇలాగే కొనసాగితే మరో ప్రజా ఉద్యమం రాకతప్పదని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ని బహిరంగంగానే హెచ్చరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. Also read : AICC : కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్
సీఎం కేసీఆర్‌కి ధీటుగా దూకుడు ప్రదర్శించే రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి సమర్ధుడని పార్టీ అధిష్టానం సైతం భావిస్తున్నట్టు ఆయన అనుచరగణం చెబుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీలోనే పలువురు సీనియర్ నేతలు ( Telangana congress leaders ) అసంతృప్తితో ఉన్నారని.. ఆ కారణంగానే పార్టీకి అవసరమైన పలు సందర్భాల్లో పార్టీ నేతలు ఒక్క తాటిపైకి రావడం లేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పీసీసీ మార్పు తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది. Also read : NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే
ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డి కాకుండా ముందు నుంచి పార్టీకి పనిచేసిన ఇతర నేతలు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్న వారిలో ఉన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి సొంత సామాజిక వర్గం నుంచే కాకుండా ఇతర సామాజిక వర్గాల నుంచి సైతం పోటీ ఉన్నప్పటికీ.. మిగతా నేతలతో పోల్చుకుంటే ప్రస్తుతం అధికార పార్టీపై ఎక్కువ దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికే ఆ అవకాశం ఎక్కువుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోనుందనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. Also read : New Revenue Act 2020: కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం.. రిజిస్ట్రేషన్ పని ఇక వారిదే
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
SBI home loans: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ
TS ECET counselling schedule: ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదిగో
Minister KTR: మైక్ ఇస్తే హీరోగిరి చేస్తామంటే నడవదు : కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR