4 persons drown in Godavari River: హైదరాబాద్: దీపావళి పండుగ పూట తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాగా.. మరో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం (mulugu venkatapur) మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం జరిగింది. అయితే స్నానానికి వెళ్లి గల్లంతయిన వారిన శ్రీకాంత్, కార్తీక్, అన్వేష్, ప్రకాశ్‌ గా గుర్తించారు. వీరిలో ఇద్దరి దేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం పోలీసులు, ఈతగాళ్లు గాలిస్తున్నారు. Also read: Amyra Dastur: మతిపోగొడుతున్న అమైరా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ స్నేహితుని పుట్టినరోజు కావడంతో.. మండలంలోని రంగరాజపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి పరిసర ప్రాంతానికి వెళ్లారు. వారంతా అక్కడే భోజనం వండుకుని తిని.. సంతోషంగా కేక్ కూడా కట్‌ చేశారు. అనంతరం అందరూ సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి నదిలోకి దిగారు. అయితే గోదావరిలోకి దిగిన16 మందిలో 12 మంది ఒడ్డుకు చేరుకోగా నలుగురు (4 persons drown in Godavari River) గల్లంతయ్యారు. నలుగురు ఎంతసేపటికీ రాకపోవడంతో మిగతా యువకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. ఈ సమాచారంతో గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ములుగు జిల్లాల్లోని మరికల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Also read: Tamannaah: హాట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మిల్కీ బ్యూటీ


Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక


Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe