Telangana Tobacco Ban: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..
Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
Tobacco nicotine products ban in telangana: తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ క్రమంలో.. తెలంగాణ సర్కార్ కూడా దీనిపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది. తెలంగాణను మత్తుపదార్థాలు అమ్మడంపై కొరడా ఝుళిపించింది. ఇక మీదట తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం, అమ్మడం వంటికి చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. మత్తుపదార్థాల ఫ్రీస్టేట్ గా తెలంగాణకు మార్పు చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకొవాలని పోలీసులు, అబ్కారీ అధికారులు, విజిలెన్స్ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రజల ఆరోగ్యం, భద్రతల దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు రేవంత్ సర్కారు వెల్లడించింది. పొగాకు, నికోటిన్‌లు ఇతర మత్తు పదార్థాల తయారీ, అమ్మడం, గుట్కా/పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నిషేధం 24 మే 2024 నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇరు తెలుగు స్టేట్స్ లలో ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి హేమ పాల్గొన్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆమె బ్లేట్ సాంపుల్ లో.. డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టు రావడంతో తమ ముందు హజరు కావాలంటూ బెంగళూరు క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?
ఇక రేవ్ పార్టీ విషయంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్న కూడా వదలోద్దని దర్యాప్తును వేగవంతంగా జరపాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మత్తుపదార్థాల ఫ్రీ స్టేట్ గా మార్చాలని అన్నారు. అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం, ఆహర భద్రత తమ మొదటి ప్రయారిటీ అని రేవంత్ అన్నారు. ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే ఎలాంటి చర్యలపై అయిన ప్రభుత్వం కఠినంగా వ్యవహరింస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన దైన స్టైల్ లో పాలన అందిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతునే మరోవైపు ప్రజలకు పథకాలు అందలే చర్యలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వేడులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మిగత సీనియర్ నేతలకు ఇన్ వైట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు తెలంగాణలో వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఇప్పటికే, అధికారులు చర్యలు ప్రారంభించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter