TPCC New Chief: తెలంగాణలో కాంగ్రెస్ బాస్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరనేది ఈ ఏడాది తేల్చడం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. వచ్చే ఏడాదే టీపీసీసీ చీఫ్ ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో 1500 దాటిన కరోనా మరణాలు


 


టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఎవరు, బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కొత్తగా చేరిన నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కోసం నేతలు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నామని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అయితే పార్టీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే టీపీసీసీ చీఫ్ ఎంపికలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.


Also Read: Jyoti Amge: ప్రపంచంలో అతిచిన్న మహిళ.. 10 ఆసక్తికర విషయాలు



కాగా, టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)నే టీపీసీసీ చీఫ్ పదవి వరించనుందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్య పోరు నడుస్తుందని సైతం ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్, రాహుల్ గాంధీల సూచన మేరకు మాణిక్యం ఠాగూర్ రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారని అంతా ఆశించారు. కానీ మరోసారి పార్టీ నేతలు నాన్చుడిధోరణికే పరిమితం కావడంతో టీపీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ వచ్చే ఏడాది ఆరంభం వరకు కొనసాగనుంది. 


Photos: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook