హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అందులో చాలా మంది దృష్టిని ఆకర్షించిన ప్రధానమైన అంశం ఏంటంటే.. జంట నగరాల్లో 20 వేల లీటర్లలోపు నీరు వాడుకునే వారికి ఉచితంగా తాగునీరు సరఫరా అందించనుండటం. డిసెంబర్‌ నెల నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. నిరుపేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల మీద కొంతైనా ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది అమలులోకి వస్తే.. 97 శాతం మంది ప్రజలకు మేలు కలుగుతుందని కేసీఆర్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ( GHMC Elections TRS manifesto ) విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో నగరంలో నీటి సరఫరా విషయానికొస్తే.. వారం రోజులు, పది రోజులు, ఒక్కో చోట ఒక్కోసారి పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. గల్లీల్లోకి వాటర్‌ ట్యాంకర్లు వస్తే.. అక్కడ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం కొట్టుకునే యుద్ధాలను చూశాం. కానీ మిషన్‌ భగీరథ ( Mission Bhagiratha ) పుణ్యమా అని ఆ ఇబ్బందులన్నీ పోయాయన్నారు. ప్రస్తుతం నగరానికి మాత్రమే అని కాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉండేటువంటి హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాంతాలకు సైతం పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 


Also read : Student registration in TASK: టాస్క్‌లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నారా ?


ఒకప్పటి నీళ్ల కష్టాలను పోగొట్టినట్టే ఇకపై నీటి బిల్లుల కష్టాలు కూడా పోగొట్టేందుకే ఉచిత మంచి నీటి సరఫరా అందించే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన సీఎం కేసీఆర్ ( CM KCR ).. భవిష్యత్తు తరలా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే 50 ఏళ్లకు సరిపడా తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణం వెనుకున్న వ్యూహం కూడా అటువంటిదే అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.


Also read : Coronavirus second wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందా ? మంత్రి ఈటల మాటేంటి ?


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి