Coronavirus second wave: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వస్తుందా ? మంత్రి ఈటల మాటేంటి ?

విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని... అవసరమైతే స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

  • Nov 21, 2020, 23:58 PM IST

హైదరాబాద్‌లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్-2020 పేరుతో 'సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్' అంశంపై శనివారం జరిగిన ఓ సమావేశానికి మంత్రి ఈటల హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు తలెత్తుతున్న పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. 

1 /7

తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వస్తుందా అంటే వచ్చే అవకాశం ఉండకపోవచ్చనే అంటున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

2 /7

రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కరోనావైరస్‌‌ను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం అన్నివిధాల సిద్ధంగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు.

3 /7

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. '' ప్రతి రోజూ 50 వేల మందికి కరోనా పరీక్షలను ( COVID-19 tests ) నిర్వహిస్తున్నాం'' అని తెలిపారు.

4 /7

తెలంగాణలో పాఠశాలలు ప్రారంభించడానికి ప్రైవేట్ యాజమాన్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం వైపు నుంచి కూడా అనుమతులు లభించాలని కోరుకుంటున్నట్టు ట్రస్మా ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

5 /7

విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని... అవసరమైతే స్కూళ్లలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

6 /7

హైదరాబాద్‌లో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్-2020 పేరుతో 'సేఫ్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్' ( Safe reopening of schools ) అంశంపై శనివారం జరిగిన ఓ సమావేశానికి హాజరై మాట్లాడుతూ మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.  Also read : GHMC Elections: రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆందోళన.. కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

7 /7

పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను మిగతా విద్యార్థులతో కలవకుండా హోమ్ క్వారంటైన్ పాటిస్తూ ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకునే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.  Also read : GHMC Elections: రేవంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఆందోళన.. కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?