COVID-19 vaccine: భారత్ చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలపై భూటాన్ ఆసక్తి
భారత్‌లో తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ( COVID-19 vaccine trials ) పాల్గొనేందుకు భూటాన్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. భారత్‌లో జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భూటాన్ ప్రభుత్వం నుంచి భారత్‌కి ఓ లేఖ వచ్చినట్టు తెలుస్తోంది.
న్యూ ఢిల్లీ: భారత్‌లో తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ( COVID-19 vaccine trials ) పాల్గొనేందుకు భూటాన్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. భారత్‌లో జరుగుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భూటాన్ ప్రభుత్వం నుంచి భారత్‌కి ఓ లేఖ వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ ఈ ఆగస్టు 15న 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో భూటాన్‌కి చెందిన క్యూన్సెల్ అనే న్యూస్ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భూటాన్లో భారత రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్ ( Ruchira Kamboj ) ఈ వివరాలు వెల్లడించారు. Also read : COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం
భారత్‌లో ప్రస్తుతం కరోనావైరస్ ( Coronavirus ) చికిత్స కోసం మూడు సంస్థలు వేర్వేరుగా కొవిడ్-19 వ్యాక్సిన్స్ తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్-సిరం ఇనిస్టిట్యూట్ ( Oxford-Serum institute ) తయారు చేస్తోన్న వ్యాక్సిన్ కాగా రెండోది భారత్ బయోటెక్-ఐసిఎంఆర్ ( Bharat Biotech-ICMR vaccine ) చేస్తోన్న వ్యాక్సిన్. ఇక మూడోది జైడస్ క్యాడిలా తయారు చేస్తోన్న వ్యాక్సిన్. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-సిరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఫేస్ 3 ట్రయల్స్‌లో ఉండగా.. భారత్ బయోటెక్-ఐసిఎంఆర్ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ఫేజ్1, 2 దశలో ఉంది. జైడస్ క్యాడిలా ( Zydus Cadila vaccine ) తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేస్ 2 ట్రయల్స్‌లో ఉంది. Also read : COVID-19: ఏపీలో 24 గంటల్లో 97 మంది మృతి
ఈ సందర్భంగా భారత్-భూటాన్ మధ్య సంబంధాలు, పరస్పర సహకారం గురించి రుచిరా మాట్లాడుతూ.. '' భూటాన్‌కి అందిస్తున్న నిత్యవసరాల సరుకు రవాణా ఆగిపోకుండా భారత్ చర్యలు తీసుకుంటోందని.. కరోనా సంక్షోభంలోనూ భూటాన్‌కి భారత్ అండగా నిలుస్తుంది'' అని అన్నారు. Also read : కరోనా నుంచి కోలుకుంటున్న యంగ్ హీరోయిన్