కయ్యానికి కేరాఫ్ చైనా ( China ) . ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ దేశానికి వివాదం కేవలం భారత్ తోనే కాదు..ఏకంగా 18 దేశాలతో నెలకొంది. ఏదో విధంగా వివాదం సృష్టించడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇప్పుడా దేశం సరిహద్దు ( Border disputes with china )  నిండా వివాదాలే నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విస్తరణ వాదం చైనాను ప్రపంచదేశాల్లో వివాదాస్పద దేశంగా మారుస్తున్నాయి. కేవలం భారత్ తోనే కాదు ఆ దేశానికున్న వివాదం సరిహద్దు వెంబడి ఉన్న ప్రతిదేశంతోనూ ఉంది. మరి కొన్ని దేశాలతో అయితే సరిహద్దుతో సంబంధం లేకుండా మిగిలిన ప్రపంచదేశాలతో కూడా ఉంది. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలే దీనికి కారణం. సరిహద్దు ఒప్పందాల్ని యధేచ్ఛంగా ఉల్లంఘించడం, పొరుగుదేశాలపై కన్నేయడం ఆ దేశానికి అలవాటు. అందుకే డ్రాగన్ తీరుపట్ల జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Also read: Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?


భారత్ తో చైనా వివాదం పాతదే అయినా సరే...తాజాగా గల్వాన్ ( Galwan valley )  లోయలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో  భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులవడం వివాదాన్ని యుద్ద పరిస్థితులకు దారి తీసింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ( South china sea )  ఆధిపత్యం చెలాయించాలనుకునే ఆ దేశ వైఖరి మిగిలిన దేశాల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇవి చాలదన్నట్టు కరోనా సంక్రమణ ( Corona spread )  నేపధ్యంలో ఆ దేశ వైఖరి అమెరికా, ఫ్రాన్స్ ల ఆగ్రహానికి కారణమైంది. 


ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 18 దేశాలతో చైనాకు సరిహద్దు వివాదముంది. భారత్ నుంచి మొదలుకుని జపాన్, ఫిలిప్పీన్స్ వరకూ విస్తరణ భావజాలంతో వివాదాలు సృష్టిస్తోంది. భూభాగం పరంగా 14 దేశాలతో వివాదమున్నా సరే...మిగిలిన అంశాల పరంగా చూస్తే 18 దేశాలున్నాయి ఈ జాబితాలో. Also read: Dinosaurs Extinct :  డైనోసార్లు ఎందుకు అంతరించాయి అనేది తెలిసింది


చైనాతో వివాదమున్న దేశాలు-కారణాలు


వియత్నాం ( Vietnam )  కు చెందిన పలు చారిత్మాత్మక ప్రాంతాలైన మాకిల్స్ ఫీల్డ్ బ్యాంక్, పారాసీల్ ఐస్ లాండ్ తో పాటు దక్షిణ చైనా సముద్రంలోోని భాగాల్ని, స్ప్రాట్లీ ఐస్ లాండ్స్ ను తనవిగా చైనా వాదిస్తోంది. 


38 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్సాయ్ చినాయ్ ( Aksai chin ) భారత ప్రాంతాన్ని చైనా ఏళ్ల క్రితమే ఆక్రమించింది. ఇది చాలదన్నట్టు లడాఖ్ ( Ladakh ) , అరుణాచల్ ప్రదేశ్ ( Arunachalpradesh )  లపై కన్నేసింది. ఇదే రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. 


అటు నేపాల్ తో కూడా 1788-1792 మధ్య కాలంలో యుద్ధం జరిగింది. అప్పట్లో ఆక్రమించిన నేపాల్ ( China nepal war )  భూభాగాల్ని తమ ప్రాంతాలుగా చైనా ప్రకటిస్తోంది. ఆఖరికి మిత్రదేశంగా భావించే ఉత్తర కొరియాతో ( North korea )  కూడా బేక్డూ మౌెంటెన్ విషయంలో ఘర్షణ ఉంది. 


దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై చైనా ఫిలిప్పీన్స్ ( China Philippines)  ల మధ్య ఘర్షణ ఎప్పట్నించో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిలిప్పీన్స్ వీటిని గెల్చుకున్నప్పటికీ చైనా వాటిని ఖాతరు చేయడం లేదు. Also read: Amazon Bonus: అమెజాన్ ఉద్యోగులకు భారీ బోనస్


ఇక  అగ్రరాజ్యం రష్యాను కూడా వదలడం లేదు. రష్యాకు చెందిన  1  లక్షా  60 వేల స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని తమదిగా చైనా వాదిస్తోంది. రెండు దేశాల మధ్య ఈ విషయమై ఒప్పందాలు జరిగినా చైనా వాటిని పట్టించుకోవడం లేదు. 


మరోవైపు  దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై సింగపూర్ తో వివాదం ఇంకా రేగుతోంది. రెండు దేశాలు ఈ భాగాలపై పట్టుబడుతున్నాయి. 


ఈస్ట్ చైనాలో ఉన్న సౌత్ కొరియా కూడా తమదేనంటోంది చైనా. అటు భూటాన్ కూడా తమ దేశ పరిధిలోనిదేనంటూ వాదన చేస్తోంది. 


దక్షిణ చైానా సముద్రంలోని చిన్న దేశమైన తైవాన్ ( Taiwan )  పై అయితే ఈ దేశానికి దశాబ్దాల నుంచే కన్నుంది. మరోవైపు లావోస్, బ్రూనై, తజికిస్తాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలోని పలు భాగాలు తమ దేశానివేనని అవకాశం లభించినప్పుడల్లా వాదిస్తోంది చైనా.


ఇక జపాన్ విషయానికొస్తే...సెంకా ఐస్ ల్యాండ్, ర్యుక్యూ ఐస్ లాండ్ లపై రెండు దేశాల మధ్య వివాదం చాలాకాలంగా ఉంది. Also read: Tiktok: దేశానికి వ్యతిరేకంగా వాదించను: మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ


చైనా ఈ వైఖరి కారణంగానే అగ్రదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధమే జరిగితే చైనాను ఇరుకునపెట్టేందుకు చాలా దేశాలు ముందుకొస్తాయనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.