Covid 19 In America: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు కోటి 60 లక్షల మంది కోవిడ్-19 ( Covid 19 ) సంక్రమణకు గురి అయ్యారు. ఇందులో ఆరు లక్షల మంది మరణించారు. మరో వైపు కరోనావైరస్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి ( Covid 19 In America ) స్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం 44 లక్షల మందికి కోవిడ్-19 వైరస్ సోకింది.  ఇందులో లక్షా 50 వేలకు పైగా ప్రజలు మరణించారు. తాజా సమాచారం ప్రకారం బుధవారం నాడు మరణాల సంఖ్య లక్షా 50 వేలకు చేరుకుంది. గత 11 రోజుల్లోనే 10 వేల మంది మరణించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also: Rafale Facts : రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు



అమెరికాలో గత మూడు వారాలుగా కరోనా మరణాల ( Covid 19 Mortalility In USA ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే కేసుల సంఖ్య ఇటీవలే నెమ్మదించింది. అయితే అరిజోనా 
( Arizona ) , కాలిఫోర్నియా ( California ), ఫ్లోరిడా ( Florida ) రాష్ట్రాల్లో.. ఆసుపత్రుల్లు కోవిడ్-19 పేషెంట్స్ తో నిండిపోయాయి. దీంతో ఈ రాష్ట్రాలు మళ్లీ మార్కెట్లను మూసి లాక్ డౌన్ దిశలో ఆలోచన చేస్తున్నాయట. టెక్సాస్ ( Texas ) రాష్ట్రంలో జూలై నెలలోనే ఏకంగా 4000 మంది మరణించారు. ఫ్లొరిడాలో 2,690 మంది, కాలిఫోర్నియాలో 2500 మంది కరోనావైరస్ ధాటికి ప్రాణాలు విడిచారు. 

Read This Story Also: Memes On Sonu Sood: సోనూ సూద్ పై వస్తున్న టాప్  మీమ్స్  ఇవే