Kim Jong Un: ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట
కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.
కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్ 19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు. చైనా, దక్షిణ కొరియాలో కోవిడ్ 19 ( Covid 19 ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సరిహద్దులు బ్యాన్ చేశామని, లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌కు ( Isolation ) పంపించామని కిమ్ తెలిపాడు. అయితే కరోనావైరస్ వల్ల ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉంది అని... ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని సూచించాడు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న వైరస్ ఉత్తర కొరియాను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది అని కిమ్ హెచ్చరించాడు. Also Read : India vs China: భారత్, చైనా వివాదంలో జోక్యం చేసుకోలేమన్న రష్యా
ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు సుమారు 922 కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపాడు కిమ్ జోంగ్ ఉన్. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ ( Quarantine ) చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని ఉత్తరకొరియా అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ( WHO) తెలిపారని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..