వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ( US President Donald Trump ) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అమెరికాలో కరోనావైరస్ ( Coronavirus in USA) కట్టడి చేయలేకపోయాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్‌ని తయారు చేస్తోన్న బయోటెక్ సంస్థ మొడెర్నా ( Moderna biotech ) మరో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందుగా మొడెర్నా వ్యాక్సిన్ ( Moderna vaccine ) రావడం సాధ్యపడదని మొడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ ( Moderna CEO Stephane Bancel ) తేల్చిచెప్పేశారు. ఫినాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్టీఫేన్ ఈ విషయాన్ని వెల్లడించారు. Also read : Jobs in USA: 2023 వరకు ఈ కష్టాలు తప్పవట


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, మరోవైపు అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే నాటికే ( నవంబర్ 3 ) మొడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్‌కి ఇప్పుడు మొడెర్నా చేసిన ప్రకటన తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నంత త్వరగా మొడెర్నా వ్యాక్సిన్ తయారు కాదనే సంకేతాలు ట్రంప్‌పై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Also read : America Debate: అధ్యక్ష అభ్యర్ధుల వాదనలో ఎవరిది పై చేయి?


ఇప్పటికే కరోనాను కట్టడి చేయలేని అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పుడు కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) కూడా ఆలస్యం అవుతుందని తెలిస్తే.. ఆయనపై ఉన్న ఆగ్రహం ఇంకా రెట్టింపు అవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ అదేకానీ జరిగితే.. ఈ పరిణామం ట్రంప్ ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ అభ్యర్థి జోయ్ బిడెన్‌కి ( Joe Biden ) కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe