America Debate: అధ్యక్ష అభ్యర్ధుల వాదనలో ఎవరిది పై చేయి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అందుకే అందరికీ ఆసక్తి. అధ్యక్ష అభ్యర్ధులిద్దరూ ముఖాముఖి చర్చల్లో తలపడతారు. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ బైడెన్ ల చర్చ ఆసక్తికరంగా సాగింది. వాదోపవాదనలు సాగాయి.

Last Updated : Sep 30, 2020, 01:45 PM IST
  • డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ జో బైడెన్ ల చర్చ
  • అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముఖాముఖి వాదన
America Debate: అధ్యక్ష అభ్యర్ధుల వాదనలో ఎవరిది పై చేయి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ( America president elections ) అందుకే అందరికీ ఆసక్తి. అధ్యక్ష అభ్యర్ధులిద్దరూ ముఖాముఖి చర్చల్లో తలపడతారు. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ బైడెన్ ( Donald trunp versus joe biden debate ) ల చర్చ ఆసక్తికరంగా సాగింది. వాదోపవాదనలు సాగాయి.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వినూత్నమైన అంశాలు వెలుగుచూస్తుంటాయి. ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులు ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగానే చర్చలు జరుపుతుంటారు. ఎన్నికల ప్రచారం ఓ ఎత్తైతే..ఇరువురు అభ్యర్ధులు పలు దశలుగా ముఖాముఖి చర్చల్లో  ( Face to Face Debate ) పాల్గొంటుంటారు. ఇందులో భాగంగా తొలి చర్చఆసక్తికరంగా..వాడివేడిగా సాగింది. విభిన్న అంశాలు చర్చకొచ్చాయి. ఒకరిపై మరొకరు ప్రశ్నలు సంధించుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బైడెన్ ( Democratic party Biden ), రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Republican party Donald trump )మధ్య సాగిన చర్చల్లో వచ్చిన అంశాలివే.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో వచ్చిన ఆరోపణలు, విమర్శలపై మొదటి ప్రశ్నతో ముఖాముఖి ప్రారంభమైంది. అమెరికాలో ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని బైడెన్‌ అన్నారు. ఇప్పటికే వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. ఒబామా కేర్ పాలసీ ( Obama care policy ) ని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. బైడెన్‌ వ్యాఖ్యలను ట్రంప్‌ ఖండిస్తూ.. గత ఎన్నికల్లో గెలిచాం కాబట్టే సుప్రీంకోర్టు నియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. తనను మూడేళ్ల కోసం ఎన్నుకోలేదని ధీటుగా సమాధానం ఇచ్చారు. 

ట్రంప్‌ తెచ్చిన హెల్త్‌స్కీమ్‌పై ఇరువురి మధ్య చర్చసాగింది. ఒబామా కేర్‌కు ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేక పోయారని బైడెన్‌ సూటిగా ప్రశ్నించారు. ఒబామా కేర్‌ను రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. దీనికి బదులుగా.. తమ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని ట్రంప్‌ తెలిపారు. మందుల ధరలు గణనీయంగా తగ్గాయని గుర్తు చేశారు. 

కరోనా వైరస్ ( Coronavirus ) పై ప్రజలను అప్రమత్తం చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని బైడెన్‌ తీవ్రంగా విమర్శించారు. కోవిడ్ నియంత్రణలో ట్రంప్‌ విఫలమయ్యారని, వైద్య, ఆరోగ్య విధానంపై ట్రంప్‌కు సమగ్ర ప్రణాళిక లేదని అన్నారు. అయితే...దీనికి సమాధానంగా.. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అమెరికాకు చేసిందేమీ లేదని ట్రంప్ చెప్పారు. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనాతో ఎంతమంది చనిపోయారో బైడెన్‌కు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని బైడెన్ చెప్పగా...అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని ట్రంప్ తెలిపారు. Also read: Disney Job Cuts: వాల్ట్ డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత.. తప్పడం లేదంటూ ప్రకటన

 

Trending News