హైద‌రాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T క‌ణాల ( T Cells ) పాత్రే కీల‌కం అని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. కరోనావైరస్‌కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా అమెరికాలోని లా జొల్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాల‌జీ ( La Jolla Institute for Immunology ) ప‌రిశోధ‌కులు తాము చేసిన అధ్యయనంలో ఈ విష‌యాన్ని కనుగొన్నట్టు తెలిపారు. కోవిడ్‌-19ని నియంత్రించాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తిలో ( Immunity ) భాగమైన T క‌ణాల పాత్రే కీలకంగా మారినట్టు ప‌రిశోధ‌కులు తేల్చిచెబుతున్నారు. Also read : AP: 6లక్షలు దాటిన కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో ఉండే ఒక రకమైన తెల్ల రక్త కణాలనే ( White blood cells )  ఈ టి సెల్స్ లేదా టి కణాలు అంటారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని సమన్వయపర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో యాంటీబాడీల‌తో ( antibodies ) పాటు T క‌ణాలు అధిక మోతాదులో ఉంటేనే వైర‌స్ తీవ్రతను త‌గ్గించే అవ‌కాశాలు ఉన్నాయని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు పరిశోధకులు పేర్కొన్నారు. కరోనావైరస్‌కి చెక్ పెట్టేందుకు తయారవుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్స్ ( COVID-19 vaccines ) సైతం కొవిడ్-19 వ్యాధిగ్రస్తుల శరీరంలో యాంటీబాడీలతో పాటు టి సెల్స్ కూడా పెంపొందించే విధంగా ఉండాలని.. అప్పుడే కొవిడ్-19కి చెక్ పెట్టగలమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ మేరకు తమ అధ్యయనం ఫలితాలకు సంబంధించిన నివేదికను సెల్ జ‌ర్న‌ల్‌లో ప్రచురించారు. ఇన్‌ఫెక్ష‌న్ అధికంగా ఉన్న వారిలో యాంటీబాడీల క‌ంటే.. టీ క‌ణాల ఆవశ్యకతే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు పరిశోధకులు గుర్తించారు. Also read : Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం


Coronavirus సోకిన 50 మంది రక్త నమూనాలను పరిశీలించినప్పుడు తమకు ఈ విషయం అర్థమైందని పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న వారిలో టి కణాల సంఖ్య తక్కువగా ఉందని.. అలాగే టి కణాల సంఖ్య ఎక్కువగా ఉన్న వారిలో కరోనా ప్రభావం కూడా తక్కువగా ఉందని పరిశోధకులు ఓ నిర్ధారణకు వచ్చారు. 65 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు ( COVID-19 in above 65 years old age people ) కొవిడ్-19 తీవ్ర ఇబ్బందులకు గురిచేయడానికి కారణం కూడా వారి శరీరంలో ఈ T క‌ణాల సంఖ్య‌ అంత ఎక్కువ‌గా ఉండ‌కపోవడమేనని.. అందువల్లే వారిలో కోవిడ్‌-19 వ్యాధి తీవ్రతను త‌గ్గించం క్లిష్టంగా మారుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు అభిప్రాయపడ్డారు. Also read : Covid19 vaccine: అమెరికన్ కంపెనీ నోవావాక్స్ తో సీరమ్ ఒప్పందం


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR