H1B Visa:హెచ్1బీ వీసాల విషయంలో ఐటీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టి పారేసింది. విధానం పారదర్శకంగా లేదని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతీయ ఐటీ నిపుణులకు ( It Experts ) భారీ ఊరట లభించే వార్త వెలువడింది. ట్రంప్ ప్రభుత్వం ( Trump Government ) ప్రవేశపెట్టిన హెచ్1బీ వీసా ఆంక్షల్ని అమెరికా ఫెడరల్ కోర్టు ( Federal court ) కొట్టి పారేసింది. హెచ్1బీ వీసా ఆంక్షల్ని కఠినతరం చేస్తూ ట్రంప్ చేసిన మార్పులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని పాటించలేదని..కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఉద్యోగ నష్టాల్ని పుచ్చుకోవడానికి వాదించడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. వాస్తవానికి అక్టోబర్ నెలలో ట్రంప్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసిందని కోర్టు తెలిపింది.


ఈ తీర్పు ద్వారా బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఇతర విద్యావ్యాపార వర్గాలు విజయం సాధించినట్టైంది. ఆర్థిక వ్యవస్థకు లభించిన విజయమని..చెత్త ఆదేశాలపై సాధించిన గెలుపని బే ఏరియా కౌన్సిల్ తెలిపింది. త్వరలో జో బిడెన్ ( Joe Biden ) అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Also read: Pfizer comments: వ్యాక్సిన్ కంపెనీ నుంచే వ్యాక్సిన్ అవసరం లేదన్న వ్యాఖ్యలు..ఎందుకు


అమెరికా ( America ) దేశంలో విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్థానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం వీసాలపై ఆంక్షలు విధించింది. హెచ్1బీ వీసాలపై ధర్డ్ పార్టీ సంస్థల్లో హెచ్1బీ ( H1B Visa ) ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని బే ఏరియా కౌన్సిల్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు సవాలు చేశాయి. ప్రతి యేటా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో దాదాపు 85 వేల వీసాల్ని ఇస్తోంది. ఈ వీసాలకు మూడేళ్ల గడువుంటుంది. తరువాత వీటిని రెన్యువల్ చేసుకోవల్సి వస్తుంది. అమెరికాలో హెచ్1బీ వీసాల్ని పొందినవారిలో 6 లక్షలమంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు. 


అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ బాథ్యతలు స్వీకరించిన తరువాత..ట్రంప్ ఆంక్షల్ని రద్దు చేేసే అవకాాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే లక్షలాది మంది భారతీయుల వీసా ఇబ్బందులు తొలగనున్నాయి. Also read: Corona Vaccine By UK: ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్.. ఆమోదించిన యూకే ప్రభుత్వం