ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ..వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ నుంచి..వ్యాక్సిన్ అవసరం లేదంటూ వ్యాఖ్యలు వెలువడటం సంచలనమౌతోంది.
కరోనా వ్యాక్సిన్ ( corona vaccine ) తుది ఫలితాల్లో 95 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రకటించడమే కాకుండా..డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందిస్తామని అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ( Pfizer company ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కంపెనీ నుంచి వెలువడిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. ఫైజర్–బయోన్టెక్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మైఖేల్ యెడాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతం చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్లు అవసరం లేదని చెప్పి అందర్నీ నిర్ఘాంతపరిచారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదని..వాస్తవానికి వ్యాక్సిన్ల గురించి కొన్ని వార్తలు చదివితే చిరాకేస్తుందని కూడా అన్నారు.
వ్యాధి బారిన పడని వారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ముఖ్యంగా మనుషుల మీద ప్రయోగాలు జరపని వ్యాక్సిన్లను లక్షలాదిమంది ఆరోగ్యవంతులైన ప్రజలకు ఇవ్వాలని భావించడం కూడా సరైంది కాదన్నారు. వాస్తవానికి..యూకే ప్రభుత్వ రంగ సంస్థ సేజ్ ( Scientific Advisor group for emergencies )పై విమర్శల్లో భాగంగా డాక్టర్ యెడాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ -19 వైరస్ ( Covid 19 virus ) ను ఎదుర్కొనే క్రమంలో యూకేలో పబ్లిక్ లాక్డౌన్ విధానాలను నిర్ణయించడంలో సేజ్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ విషయంలోనే డాక్టర్ యెడాన్.. సేజ్ తప్పిదాలను ఎత్తి చూపారు. సేజ్ తీర్మానాల కారణంగా గత ఏడు నెలలుగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన మండిపడ్డారు.
మరోవైపు తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్ బయోన్టెక్ ( Pfizer-Biontech ) కంపెనీలు అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA ) కు దరఖాస్తు పెట్టుకున్నాయి. డిసెంబర్ పదవ తేదీన జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది. అనుమతులు లభిస్తే..24 గంటల్లో వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసి..డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. Also read: Pakistan: అత్యాచారం చేస్తే..అంతే సంగతులు..అది మటాష్ ఇక