Corona Vaccine By UK: ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్.. ఆమోదించిన యూకే ప్రభుత్వం

Pfizer vaccine approved by Uk : ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.

Last Updated : Dec 2, 2020, 02:53 PM IST
  • ఫైజర్- బయోన్టెక్ కరోనా వ్యాక్సిన్ కు యూకే ఆమోద ముద్ర
  • యూకేకు చెందిన ఎంహెచ్ఆర్ఏ పరిశీలనలో లభించిన అనుమతి
  • వచ్చే వారంలో యూకేకు వ్యాక్సిన్ సరఫరా
Corona Vaccine By UK: ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్.. ఆమోదించిన యూకే ప్రభుత్వం

Pfizer vaccine approved by Uk : ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేయడంతో వచ్చే వారానికి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఫైజర్ తెలిపింది. కోవిడ్ వైరస్ పై పోరులో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని కంపెనీ పేర్కొంది. మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA ) ప్రకారం ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షిస్తుంది. 

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ ను జర్మనీకు చెందిన బయోన్టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. అన్ని వయస్సులు, జాతులు, ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ఫైజర్-బయోన్టెక్ సంస్థ ప్రకటించింది.

యూకే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంహెచ్ఆర్ఏ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాల డేటాను విశ్లేషించి..ఎలా పనిచేస్తుందో పరిశీలించింది. ఆ తరువాత ఆమోద ముద్ర వేసింది. 2021 చివరి నాటికి యూకేకు 40 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందుతాయి. ఆ దేశంలోని మూడోవంతు జనాభాకు అందించడానికి ఇది సరిపోతుంది. వచ్చే ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు 20 మిలియన్ల వ్యాక్సిన్లు అందుతాయి.

Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

యూకేకు (UK)  చెందిన స్వతంత్ర సంస్థ MHRA ..వ్యాక్సిన్ నాణ్యత, సామర్ధ్యం, పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదిస్తే...వ్యాక్సిన్ తయారీ లేదా పంపిణీ ప్రారంభమైపోతుందని యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు ఫైజర్-బయోన్టెక్ సంస్థ వ్యాక్సిన్ ను ఎంహెచ్ఆర్ఏ ఆమోదించింది. ఇప్పుడీ వ్యాక్సిన్ బయోన్టెక్ జర్మన్ ఫ్యాక్టరీ, ఫైజర్ కు చెందిన బెల్జియం ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి కానుంది.

Also read: Covid-19 USA: క్రిస్మస్ వేడుకల్లో కరోనా కల్లోలం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News