తాడెపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM Jagan ) ముఖ్యమైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ లో అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలెప్ మెంట్ ఆధారిటీ ( AMRDA ) పై చర్చించినట్టు సమాచారం. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ, ముఖ్య కార్యర్శి నీలం సాహ్ని, AMRDA కమిషనర్ లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో ( Amaravati ) పనులు ఎలా సాగుతున్నాయి అని వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. వీటిని వేగవంతం చేయడానికి ఎలాంటి కార్యచరణ అమలు చేస్తున్నారో.. కొత్తగా ఏం చేయవచ్చో అధికారులతో చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



అమరావతిలో పనులను వేగవంతం చేయడానికి ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో పక్కా వ్యూహాన్ని తయారు చేయాలి అని, నిధులను సమీకరించేందుకు ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు ముఖ్యమంత్రి జగన్. కాగా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవడానికి సుమారు రూ.14 వే కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు అవుతుంది అని సమాచారం. అదే సమయంలో హాపి నెస్టింగ్ కు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి జగన్.