AP Corona Update: తగ్గుతున్న కరోనా వైరస్
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సైతం కొత్త కేసులు బయటపడుతున్నా..గత పదిహేను రోజులుగా తగ్గుతూ వస్తుండటం ఊరట కల్గిస్తోంది.
కరోనా వైరస్ ( Corona virus ) దేశవ్యాప్తంగా ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో సైతం కొత్త కేసులు బయటపడుతున్నా..గత పదిహేను రోజులుగా తగ్గుతూ వస్తుండటం ఊరట కల్గిస్తోంది.
కరోనా వైరస్ నియంత్రణలో ముందు నుంచి ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నియంత్రణలో ముఖ్యమైన నిర్ధారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా కరోనా పరీక్షలు ఏపీలోనే జరుగుతున్నాయి.
గత 24 గంటల్లో 66 వేల 769 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు ( Covid19 Tests ) నిర్వహించగా.. 5 వేల 120 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. పదిహేను రోజుల క్రితం గణాంకాలతో పోలిస్తే ఇది దాదాపుగా సగం. పదిహేను రోజుల క్రితం వరకూ రోజుకు పదివేల కొత్త కేసులు వెలుగుచూస్తుండేవి. అయితే క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 లక్షల 34 వేల 427 కి చేరింది. కరోనా వైరస్ నుంచి గత 24 గంటల్లో 6 వేల 349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6 లక్షల 78 వేల 828కు చేరుకుంది.
రాష్ష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో 34మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6 వేల 86కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 49 వేల 513 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 62 లక్షల 83 వేల 9 కోవిడ్ టెస్టులు జరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1 లక్షా 3 వేల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా..ప్రస్తుతం 9 వేల 51 యాక్టివ్ కేసులున్నాయి. తూర్పు గోదావరి జిల్లా తరువాత అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 71 వేల 917 కేసులు రిజిస్టర్ కాగా...ప్రస్తుతం 5 వేల 574 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తానికి గత పదిహేను రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుతుండటంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. Also read: Supreme court: ఇంగ్లీషు మీడియంను వ్యక్తిగతంగా సమర్ధిస్తాం